ఉద్యోగులకు అమెజాన్ హుకుం..వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే...లేకపోతే ఊస్టింగే..

By Krishna Adithya  |  First Published Oct 23, 2023, 12:30 AM IST

అమెజాన్ తన రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని అప్‌డేట్ చేసింది, వారానికి మూడుసార్లు కార్యాలయానికి రావడానికి నిరాకరించిన ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చిరించింది. 


Amazon సంస్థ ఉద్యోగులకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేసింది. ఒక నివేదిక ప్రకారం, వారానికి 3 రోజులు ఆఫీసుకు రావడానికి సిద్ధంగా లేని  వ్యక్తులను తొలగించేలా మేనేజర్లకు అనుమతిని ఇచ్చింది. వరుసగా 3 రోజులు ఉద్యోగానికి రాని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని కంపెనీ తెలిపింది. బిజినెస్ ఇన్‌సైడర్‌లోని ఒక నివేదిక ప్రకారం, కంపెనీ రూల్ ప్రకారం వారానికి మూడుసార్లు, రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాన్ని పాటించడంలో విఫలమైన ఉద్యోగులను సమర్థవంతంగా తొలగించడానికి మేనేజర్‌లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. 

కొత్త పాలసీ ప్రకారం అమెజాన్ ఉద్యోగులు వారానికి మూడు సార్లు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. వారానికి మూడు సార్లు కార్యాలయానికి రాలేని ఉద్యోగులు తమ మేనేజర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ అమెజాన్ తన అంతర్గత పోర్టల్ ద్వారా జారీ చేసింది. వారం ప్రారంభం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు వారానికి కనీసం 3 సార్లు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఆఫీసుకు రాకుండా కంపెనీ అవసరాలను తీర్చలేని ఉద్యోగులతో మేనేజర్లు మూడు-దశల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. 

Latest Videos

మొదటి దశలో, మేనేజర్లు ఆ వ్యక్తులతో వ్యక్తిగత సంభాషణ చేయవలసిందిగా కోరుతోంది. అయినప్పటికీ వారానికి 3 రోజులు కార్యాలయానికి రావాలనే రూల్ పాటించని వారితో నిర్ణీత వ్యవధిలో (ఉద్యోగి పరిస్థితిని బట్టి, 1-2 వారాలు) చర్చించవలసి ఉంటుంది. నిబంధనలు పాటించని ఉద్యోగులకు  రాతపూర్వకంగా వార్నింగ్ ఇస్తారు. ఆ తర్వాత తదుపరి చర్య తీసుకునేందుకు హెచ్‌ఆర్‌కు స్వేచ్ఛ కూడా ఇవ్వబడింది. అమెజాన్ కార్పొరేట్ ఉద్యోగులు ఈ ఏడాది మే నెల నుంచి వారానికి కనీసం మూడు సార్లు ఆఫీసుకు తిరిగి రావాలని మొదట ఆదేశించింది.

 

 

 

click me!