కాంపిటిషన్ ఆంక్షల సవాళ్లు: అమెజాన్‌కు ఆంక్షలు తప్పవా?

By Siva KodatiFirst Published Mar 24, 2019, 3:18 PM IST
Highlights

జర్మనీలో అమెజాన్ డాట్ కామ్ కాంపిటిషన్ యాంటీ ట్రస్ట్ కమిషన్ నిఘాలో ఉంది. దీనిపై త్వరలో ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. 

అమెజాన్ వెబ్ సైట్ ‘అమెజాన్‌.కామ్‌’పై జర్మనీలో ఆంక్షలు తప్పేట్లు లేవు. గతంలో గూగుల్‌ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ కూడా జర్మనీ ఆంక్షలకు గురైంది. కాంపిటీషన్‌ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు ఈ ఆంక్షలు విధించే అవకాశం ఉందని జర్మనీ మోనో పోలిస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అచిమ్‌ వాంబచ్‌ చెప్పారు. 

‘అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. దీనిలో కొన్ని ఎక్స్‌క్లూజివ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉన్నాయి. దీంతో కంపెనీ సభ్యత్వ నమోదు అంశాన్ని జర్మనీ ఫెడరల్‌ గవర్నమెంట్‌ దృష్టికి తీసుకెళ్లింది’ అని తెలిపారు.

జర్మనీ మోనో పోలిస్ కమిషన్.. ఆ దేశ ప్రభుత్వానికి వివిధ అంశాలు, నైపుణ్యాలపై సలహాలు, సూచనలు అందజేస్తుంది. గతేడాది గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ దాదాపు 4.3 బిలియన్‌ యూరోల (4.86 బిలియన్ల డాలర్ల) ఫైన్‌ విధించింది.

అప్పట్లో యాంటి ట్రస్ట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆంక్షలు విధించింది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌ తయారీదారులు ఒక్క గూగుల్‌నే ఉపయోగించేలా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయారు చేయకుండా అడ్డుకొంది. తద్వారా ఆండ్రాయిడ్ వినియోగంలో తామే డామినేటింగ్ పొజిషన్‌లో ఉండాలని గూగుల్ భావించింది. 

యూరోపియన్ యూనియన్ యాంటి ట్రస్ట్ కమిషన్ చీఫ్ మార్గెథీ వెస్టాజెర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అమెజాన్ వ్యవహరశైలిపై దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నదని చెప్పారు. స్మాలర్ షాప్స్ డేటాను ఓవర్ టేక్ చేస్తున్నట్లు అమెజాన్ పై ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దీనిపై త్వరలో విధాన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. 

click me!