అమెజాన్ బంపర్‌ ఆఫర్‌... త్వరలో వెయ్యి ఉద్యోగాలు..

By Sandra Ashok KumarFirst Published Jul 27, 2020, 6:38 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపు విధించాయి. కానీ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

కరోనా వైరస్ దెబ్బకి దిగ్గజ కంపెనీలతో సహ అన్నీ రంగాలలో ఉద్యోగాల కోత విధించింది. లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత, వేతనాల తగ్గింపు విధించాయి.

కానీ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఐర్లాండ్‌ దేశంలోని అమెజాన్‌ కార్యాలయంలో వెయ్యి ఉద్యోగలకు త్వరలో నోటిఫికేషన్‌ ప్రకటించనుంది.

అయితే క్లౌడ్ సేవలకు(డిజిటల్‌) డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది.  ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో నూతన అమెజాన్‌ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

also read 

కొత్తగా నియమించే వారు బిగ్‌డేటా స్పెషలిస్టులు, ప్రోగ్రామ్‌ మేనేజర్లు తదితర విభాగాలలో సేవలందిస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ విభాగాలలో కూడా ఉద్యోగులను నియమించుకోనున్నాట్లు చెప్పింది.

కస్టమర్లకు మైరుగైన సేవలను అందించేందుకు అమెజాన్‌ సాంకేతికతను అద్భుతంగా ఉపయోగించుకుంటుందని ఐర్‌ల్యాండ్‌కు చెందిన అమెజాన్‌ మేనేజర్‌ మైక్‌ బియరీ పేర్కొన్నారు.

click me!