అలర్ట్.. మార్చి 2023లోపు ఈ పని చేయకుంటే, మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌ అయిపోతుంది..

By Krishna AdithyaFirst Published Nov 21, 2022, 9:51 PM IST
Highlights

పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. కోట్లాది మంది ఇప్పటికే ఈ పని చేశారు. అలా చేయని వారికి మార్చి 31, 2023 వరకు సమయం ఇచ్చారు. ఈ లోపు పూర్తి చేయకపోతే, మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుందని సీబీడీటీ ప్రకటించింది. 

మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయలేదా? మీరు దీన్ని మార్చి 2023లోపు చేయకపోతే, మీ పాన్ కార్డ్ పనిచేయకుండా పోతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈరోజు (నవంబర్ 21) తెలిపింది. ఇప్పుడు మీరు ఆధార్ , పాన్ కార్డును లింక్ చేయడానికి రూ 1000 జరిమానా చెల్లించాలి. పెనాల్టీ లేకుండా ఆధార్ , పాన్ కార్డ్‌లను లింక్ చేయడానికి CBDT మార్చి 31, 2022 వరకు సమయం ఇచ్చింది.  ఆ తర్వాత, ఏప్రిల్ 1, 2022 తర్వాత రూ.500. జరిమానా విధిస్తామని సీబీడీటీ తెలిపింది. జూలై 1, 2022 తర్వాత ఈ పని చేయడానికి 1000 రూపాయలు జరిమానా విధిస్తామని CBDT తెలియజేసింది. పాన్-ఆధార్ అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. 

PAN డియాక్టివేట్ అయితే సమస్య ఇదే..
31 మార్చి 2023లోపు ఆధార్ కార్డ్‌తో PAN లింక్ చేయకపోతే, మీ PAN కార్డ్ 1 ఏప్రిల్ 2023 నుండి డీయాక్టివేట్ అవుతుంది. మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయిన తర్వాత, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయలేరు. అలాగే, మీరు బ్యాంక్ ఖాతాను తెరవలేరు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు , డీమ్యాట్ ఖాతా తెరవలేరు. రూ.50,000 కంటే ఎక్కువ బ్యాంకింగ్ లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరి. అలా పాన్ డియాక్టివేట్ చేస్తే బ్యాంకింగ్ సేవలు పొందడం కష్టమవుతుంది.

జరిమానా ఎలా చెల్లించాలి?
ఆధార్-పాన్ లింక్ కోసం అభ్యర్థనను సమర్పించే ముందు జరిమానా చెల్లించాలి. మీరు ఇప్పుడు ఆధార్-పాన్ లింక్ చేస్తే రూ. 1000. ఆలస్య రుసుము చెల్లించాలి.

స్టెప్  1: ఆధార్-పాన్ లింక్ అభ్యర్థన సమర్పణ ప్రక్రియను కొనసాగించడానికి https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jspని సందర్శించండి.
స్టెప్  2:  ఆధార్-పాన్ లింక్ అభ్యర్థనను సమర్పించడం కోసం చలాన్ నెం./ITNS 280 కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి.
స్టెప్  3: ఇప్పుడు వర్తించే పన్నును ఎంచుకోండి.
స్టెప్  4: మైనర్ హెడ్ 500 (ఫీజులు) , మేజర్ హెడ్ 0021 (కంపెనీలు కాకుండా ఇతర ఆదాయపు పన్ను) కింద ఒకే చలాన్‌లో ఫీజు చెల్లింపు జరిగిందని నిర్ధారించుకోండి.
స్టెప్  5:ఇప్పుడు మీ చెల్లింపు విధానాన్ని డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఎంచుకోండి.
చెల్లింపు చేసిన తర్వాత, పన్ను చెల్లింపుదారులు 4-5 రోజులలోపు పాన్-ఆధార్ లింక్ అప్లికేషన్‌ను సమర్పించడానికి ప్రయత్నించాలని సూచించారు.

పాన్-ఆధార్ లింక్ చేయడం ఎలా?
పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌కి లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ అనేక పద్ధతులను అందించింది. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్, SMS, NSDL లేదా UTIIL కార్యాలయాలను సందర్శించడం ద్వారా ఆధార్ కార్డ్‌ను పాన్‌తో లింక్ చేయవచ్చు. 


 

click me!