Akasa Air:ఆగస్ట్ 19 నుంచి బెంగళూరు-ముంబై ఫ్లైట్స్‌, ఆకాస ఎయిర్ టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలాగో తెలుసా?

Published : Jul 27, 2022, 10:24 AM IST
Akasa Air:ఆగస్ట్ 19 నుంచి బెంగళూరు-ముంబై ఫ్లైట్స్‌, ఆకాస ఎయిర్ టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలాగో తెలుసా?

సారాంశం

ముంబై-అహ్మదాబాద్ మధ్య వారానికి 26 విమానాలు నడపనున్నట్లు ఆకాస ఎయిర్ తెలిపింది. అలాగే బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-ముంబై మధ్య ప్రతి వారం 28 విమానాలు అందుబాటులో ఉండనున్నాయి.

దేశీయ విమానయాన సంస్థ అకాసా ఎయిర్ ఆగస్టు 19 నుంచి బెంగళూరు-ముంబై మార్గంలో విమానాలను నడపనుంది. కొత్త విమానయాన సంస్థ అకాసా  వాణిజ్య విమానాలు ఆగస్టు 7 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఆకాసా ఎయిర్ మొదట ముంబై-అహ్మదాబాద్ మార్గంలో విమానాలను నడపనుంది. అయితే బెంగళూరు-కొచ్చి మార్గంలో ఆగస్టు 13 నుండి విమానాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. 

మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అకాస ఎయిర్, "అహ్మదాబాద్, ముంబై, కొచ్చి అండ్ బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో మా నెట్‌వర్క్‌ ప్రారంభ దశను పూర్తి చేసాము" అని తెలిపింది. 

కార్యకలాపాలను పునఃప్రారంభించిన కొద్ది వారాల్లోనే వీక్లీ ఫ్లైట్స్‌ సంఖ్య 82గా ఉంటుందని ఎయిర్‌లైన్ తెలిపింది.

ముంబై-అహ్మదాబాద్ మధ్య వారంలో 26 విమానాలు నడపనున్నట్లు ఆకాసా ఎయిర్ తెలిపింది. అలాగే బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-ముంబై మధ్య ప్రతి వారం 28 విమానాలు నడపనుంది.

తాజాగా ఆకాస ఎయిర్ 28 వీక్లీ ఫ్లైట్స్‌కు టిక్కెట్ల సేల్స్ ప్రారంభించినట్లు చెప్పడం గమనార్హం. ఈ విమాన సర్వీసులు ఆగస్టు 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ మార్గంలో నడపనుంది. దీంతో బెంగళూరు-కొచ్చి మార్గంలో ఆగస్టు 13 నుంచి వారానికి 28 విమానాలు నడపవచ్చు. 
 
ఆకాస విమాన టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవచ్చు 

విమానయాన సంస్థ  అధికారిక వెబ్‌సైట్ akasaair.comలో లేదా Google Play Store నుండి Akasa Air అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రయాణీకులు  విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చని Akasa Air తెలిపింది. 

పౌర విమానయాన రంగంలో అకాసా ఎయిర్ అత్యంత తక్కువ ధరతో ప్రవేశిస్తున్న సంస్థ. విమానయాన సంస్థ ఈ నెల ప్రారంభంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ (DGCA) నుండి ఆపరేటర్ సర్టిఫికేట్ పొందింది. స్టాక్ మార్కెట్ వెటరన్ రాకేష్ ఝుంఝువాలా కూడా అకాసా ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టారు.

PREV
click me!

Recommended Stories

Gold Silver Price : 2026లో బంగారం, వెండి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
BSNL New Year Plan : జియో, ఎయిర్‌టెల్ కు బిగ్ షాక్ ! బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ 2026 సూపర్ ప్లాన్