todays petrol price: పెట్రోల్-డీజిల్ ధరపై బిగ్ రిలీఫ్ ! ఈ రోజు మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..?

Published : Jul 27, 2022, 09:25 AM ISTUpdated : Jul 27, 2022, 09:26 AM IST
todays petrol price: పెట్రోల్-డీజిల్ ధరపై బిగ్ రిలీఫ్ ! ఈ రోజు మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..?

సారాంశం

మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత మరికొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. అప్పట్లో ప్రభుత్వ చర్య వల్ల పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గింది.  

నేడు కూడా పెట్రోల్, డీజిల్‌పై సామాన్యులకు ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 105 డాలర్లుగా ఉంది. అయితే క్రూడ్ ధరలు అధికంగానే ఉన్నప్పటికి పెట్రోలియం కంపెనీలు వరుసగా 67వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది.  


మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్‌ రూ.96.72, డీజిల్‌ రూ.89.62
-ముంబయిలో పెట్రోల్‌ రూ.111.35, డీజిల్‌ రూ.97.28
-చెన్నైలో పెట్రోలు రూ.102.63, డీజిల్‌ రూ.94.24
- కోల్‌కతా పెట్రోల్ రూ. 106.03 మరియు డీజిల్ రూ. 92.76
-హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82

మే నెలలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత మరికొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. అప్పట్లో ప్రభుత్వ చర్య వల్ల పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు తగ్గింది.

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది.

మీరు  పెట్రోల్ డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ సిటీ కోడ్‌ను 9224992249 నంబర్‌కు, BPCL వినియోగదారులు RSP అండ్ సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  HPCL వినియోగదారులు HPPrice అండ్ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్