వినియోగదారులకు శుభవార్త అందించిన ఎయిర్ టెల్...

By Arun Kumar PFirst Published Jan 12, 2019, 4:24 PM IST
Highlights

భారత్ కు చెందిన టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. మార్కెట్ లో నెలకొన్న ఫోటీని తట్టుకోడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకోస్తూ  వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఎయిర్‌టెల్ మరో బంపరాఫర్‌ని ప్రకటించింది. ఇకపై  తమ నెట్ వర్క్ పరిధిలోని వినియోగదారులకు విధిస్తున్న అంతర్జాతీయ రోమింగ్ చార్జీల వసూలుచేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. 
 
ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్తో పాటు ప్రీపెయిడ్ వినియోగదారులందరికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ మిట్టల్ ప్రకటించారు. ఈ ఆఫర్కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఈమెయిల్ సమాచారాన్ని ఆయన వినియోగదారులకు అందించారు. అంతర్జాతీయ రోమింగ్ అధికంగా వుండటాన్ని గమనించి.... వారిపై భారాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోపాల్ వెల్లడించారు. 

ఇప్పటికే ఇండియా టెలికాం రంగంలో రెండో అతిపెద్ద కంపనీగా నిలిచిన ఎయిర్ టెల్ తమ వినియోగదారులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ చార్జీలను తగ్గించి ఉన్నత వర్గాలు, బిజినెస్ ఫీపుల్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 

click me!