ఇతర రోజుల కంటే జనవరి 20న అయోధ్యకు టిక్కెట్ ధరలు అధికంగా ఉన్నాయి. వేడుకకు ఒకరోజు ముందు చాలా మంది ప్రజలు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది.
అయోధ్య రామ్ మందిర్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన దినోత్సవం సందర్భంగా మీరు అయోధ్యకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? రైలు టికెట్ కోసం వెయిటింగ్ లిస్ట్ ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది. మీరు జనవరి 22న అయోధ్య చేరుకోవాలనుకుంటే, విమానంలో మాత్రమే ఛాన్స్ మిగిలి ఉంది. అయితే అయోధ్యకు వెళ్లే విమాన ఛార్జీలు వింటే షాక్ అవుతారు. థాయిలాండ్, సింగపూర్ ఇంకా హాంకాంగ్ వంటి దేశాల కంటే అయోధ్యకు విమాన టిక్కెట్ ధరలు చాల అధికంగా ఉన్నాయి.
దేశంలోని నాలుగు మూలల నుండి అయోధ్యకు విమానాల సర్వీసెస్ ఉన్నాయి. ఢిల్లీతో పాటు అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు నుంచి విమాన సర్వీసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠా రోజున అయోధ్యకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది ప్రయాణికులు వస్తారని అంచనా. రామ మందిర నిర్మాణంతో అయోధ్య ప్రధాన యాత్రాస్థలంగా, పర్యాటక కేంద్రంగా మారుతోంది. రామాలయ ప్రారంభోత్సవానికి ముందు నుంచే నగరానికి పర్యాటకుల రాక మొదలైంది. ఇతర రోజుల కంటే జనవరి 20న అయోధ్యకు టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. వేడుకకు ఒకరోజు ముందు చాలా మంది ప్రజలు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది.
సాధారణ రోజుల్లో ఢిల్లీ నుండి అయోధ్యకు టిక్కెట్ ధర 5000 నుండి 7000 రూపాయల వరకు ఉంటుంది. కానీ జనవరి 20న టికెట్ ధర రూ.15193. బెంగళూరు నుండి అయోధ్య టిక్కెట్ ధర రూ.19358. ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి అయోధ్యకు చేరుకోవాలంటే ముందుగా ఢిల్లీ చేరుకోవాలి, ఉదాహరణకు ముంబై నుంచి అయోధ్య వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. ముంబై నుంచి ఢిల్లీ మీదుగా అయోధ్యకు టికెట్ రూ.33,534.
కాగా, ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్‌కు రూ.16399, ఢిల్లీ నుంచి హాంకాంగ్‌కు రూ.9314, సింగపూర్‌కు రూ.12202గా ఉంది.