
ఎయిర్ ఇండియా అన్ని అంతర్జాతీయ విమానాలలో పలు మార్పులు చేసింది. టాటాల ఆధ్వర్యంలోని ఈ విమానయాన సంస్థ అంతర్జాతీయ విమానాల క్యాబిన్లలో "తాజా" ఇన్‌ఫ్లైట్ ఫుడ్ పానీయాల మెనూని ప్రవేశపెట్టింది. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణీకుల కోసం కొత్త మెనూలో అనేక శాఖాహార ఫుడ్స్ కూడా ప్రవేశపెట్టారు. ప్రయాణికుల సూచనలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
కొత్త మెనూ ఎలా ఉందంటే..
శాకాహార జీవనశైలిని అనుసరించే ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ఇప్పుడు వెజిటబుల్ సీక్ కబాబ్‌లు, పనీర్, తోఫు, కూరగాయలతో కూడిన థాయ్ రెడ్ కర్రీ, బ్రోకలీ, మిల్లెట్ స్టీక్, లెమన్ వెర్మిసెల్లి ఉప్మా, మేదు వడ, మసాలా వంటలను ప్లేటర్ ఆధారిత ఆహారాలను ఆస్వాదించవచ్చు.
అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం ప్రధాన , తేలికపాటి భోజనం కూడా అన్ని తరగతుల ప్రయాణికుల కోసం మెనులో చేర్చారు. వీటిలో ఫ్యూజన్ వంటకాలు, క్లాసిక్‌లు (పుట్టగొడుగు గుడ్డు ఆమ్లెట్, పసుపు మిరప ఆమ్లెట్, మిక్స్‌డ్ వెజిటబుల్ పరాటా, ఆచారి పనీర్ , శాండ్‌విచ్ వంటివి) ఉన్నాయి.
అయితే మాంసాహారుల కోసం మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఫెన్నెల్ క్రీమ్ సాస్‌లో గ్రిల్డ్ రొయ్యలు, ముర్గ్ రెజాలా కోఫ్తా, ముర్గ్ ఎలైచి కోర్మా, క్లాసిక్ చిల్లీ చికెన్, చికెన్ చెట్టినాడ్ కతి రోల్, బేక్డ్ ఫిష్ ఆఫ్ ఎ హెర్బ్ ఆల్మండ్ అండ్ గార్లిక్ క్రస్ట్, మసాలా దాల్ ,బ్రౌన్ రైస్ ఖిచ్, స్ప్రివ్ కాలామా రైస్ ఖిచ్, పెస్టోతో టొమాటో, బోకోన్సిని కాప్రెస్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
విమానంలో లభించే డెజర్ట్స్ ఇవే..
డెజర్ట్ కోసం, ప్రయాణీకులకు మ్యాంగో పాషన్‌ఫ్రూట్ డిలైట్, క్వినోవా ఆరెంజ్ ఖీర్, ఎస్ప్రెస్సో ఆల్మండ్ క్రంబుల్ మౌస్ కేక్, ఖర్జూరంతో కుంకుమపువ్వు ఫిర్ని, సింగిల్ ఆరిజిన్ చాక్లెట్ స్లైస్, బ్లూబెర్రీ సాస్‌తో చమ్-చుమ్ శాండ్‌విచ్ మరియు సీజనల్ ఫ్రూట్ అందించబడుతుంది.
ఎయిర్ ఇండియా ఇన్‌ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ ప్రకారం, కొత్త మెనూని డిజైన్ చేస్తున్నప్పుడు, అది రుచికరమైన పోషకాలను కలిగి ఉండేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. మా అతిథులు తమకు ఇష్టమైన రెస్టారెంట్‌లో ఆనందించినట్లే ఎయిర్ ఇండియా విమానాల్లోనూ వారి ఆహారం, పానీయాలను ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాము. ఎయిర్‌లైన్ ప్రకారం, ఎయిర్ ఇండియాలో అప్‌గ్రేడ్ చేసిన ఆహార అనుభవాన్ని సృష్టించడానికి అంతర్గత నిపుణుల బృందం, క్యాటరింగ్ భాగస్వాములు, సరఫరాదారులను నియమించారు.