టాటా గ్రూప్‌కు ఎయిర్ ఇండియాను అప్పగించిన కేంద్రం.. 69 ఏళ్ల తర్వాత తిరిగి పుట్టింటికి

By Sumanth KanukulaFirst Published Jan 27, 2022, 4:28 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను (Air India) గురువారం (జనవరి 27) రోజున లాంఛనంగా టాటా గ్రూప్‌నకు (Tata Group) అప్పగించింది. దీంతో 69 ఏళ్ల విరామం తర్వా త ఎయిరిండియా తిరిగి టాటాల చేతికి వచ్చింది. ఈరోజు నుంచి ఎయిరిండియా విమానాలు టాటా గ్రూప్ బ్రాండ్‌తో నడుస్తాయని అధికారులు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను (Air India) గురువారం (జనవరి 27) రోజున లాంఛనంగా టాటా గ్రూప్‌నకు (Tata Group) అప్పగించింది. దీంతో 69 ఏళ్ల విరామం తర్వా త ఎయిరిండియా తిరిగి టాటాల చేతికి వచ్చింది. ఈరోజు నుంచి ఎయిరిండియా విమానాలు టాటా గ్రూప్ బ్రాండ్‌తో నడుస్తాయని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌కు చేతికి వచ్చే ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను రూపొందించేందుకు ప్రతి ఒక్కరితో కలిసి నడిచేందుకు తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. అప్పగింతకు కొద్దిసేపటి ముందు  చంద్రశేఖర్‌ను ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.  

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ ఇండియాలో 100 శాతం వాటా విక్రయానికి కేంద్రం బిడ్డింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో 
టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ టాలేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గత ఏడాది అక్టోబరులో రూ.18,000 కోట్ల బిడ్‌తో ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. ఎయిర్​ ఇండియాను టాటా గ్రూప్​నకు అమ్మేసినట్లు అక్టోబర్​8న ప్రకటించిన మూడు రోజుల తర్వాత.. ఎయిర్‌లైన్‌లో తన 100 శాతం వాటాను విక్రయించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ టాటా గ్రూప్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) జారీ చేసింది. అక్టోబర్​ 25న ఈ డీల్‌కు సంబంధించిన షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ (ఎస్​పీఏ)పై కేంద్రం సంతకం చేసింది. 

ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియాతో పాటుగా, Air India Expressలో 100 శాతం, ఎయిర్ ఇండియా SATSలో 50 శాతం వాటాను కూడా టాటా గ్రూప్‌కు కేంద్రం అందజేసింది. ఇప్పటికే టాటా గ్రూప్‌కు ఎయిర్‌ ఏసియా ఇండియా, విస్తారాలలో మెజారిటీ వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. 

ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ముగిసినట్టుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  ‘ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిర్ణీత సమయంలో విజయవంతంగా ముగించడం నిజంగా గమనార్హం. ఇది ప్రభుత్వ సామర్థ్యాన్ని, భవిష్యత్తులో వ్యూహాత్మకేతర రంగాలలో పెట్టుబడుల ఉపసంహరణను సమర్థవంతంగా నిర్వహించాలనే సంకల్పాన్ని రుజువు చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. 

 

Your arrival was much awaited, . pic.twitter.com/OVJiI1eohU

— Tata Group (@TataCompanies)

69 ఏళ్ల తర్వాత.. 
టాటా గ్రూప్.. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని స్థాపించారు. అది చివరికి 1946లో ఎయిర్ ఇండియాగా పేరు మార్చబడింది. 1953లో అప్పటి ప్రధాని నెహ్రూ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. టాటా ఎయిర్‌లైన్స్‌లో అధిక వాటాలను కొనుగోలు చేయడడంతో ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించింది. అయితే RD Tata1977 వరకు దాని ఛైర్మన్‌గా కొనసాగారు. ఇప్పుడు 69 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్‌కు చేరింది. 

click me!