కేవలం 1000 రూపాయలకే విమానంలో ప్రయాణించవచ్చు: ఎయిర్ ఇండియా భారీ ఆఫర్‌

By Naga Surya Phani Kumar  |  First Published Aug 25, 2024, 5:14 PM IST

ధనవంతులు, వ్యాపారులు, బిజినెస్‌ మాగ్నట్స్‌, సెలబ్రెటీలు ఇలా డబ్బులున్న వారంతా విమానాల్లో తరచూ ప్రయాణిస్తుంటారు. మరి మధ్య తరగతి, పేద వారు ఎరోప్లేన్‌ ఎక్కాలంటే సాధ్యమేనా.. అయితే ఎయిర్‌ ఇండియా ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. కేవలం రూ. 1,037 ఉంటే విమానం ఎక్కే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. రండి..
 


ఎయిర్ ఇండియా.. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహించే వారు. దీన్ని ప్రస్తుతానికి టాటా యాజమాన్యం కొనుగోలు చేసి నిర్వహిస్తోంది. అసలు వాస్తవానికి ఎయిర్‌ ఇండియాను 1932లో టాటా ఎయిర్‌ లైన్స్‌ పేరుతో జేఆర్డీ టాటా ప్రారంభించారు. జాతీయీకరణలో భాగంగా 1953లో అప్పటి భారత ప్రభుత్వం ఈ సంస్థను సొంతం చేసుకుంది. ఎయిర్‌ ఇండియాగా పేరు మార్చి ఇన్నాళ్లు నిర్వహణ బాధ్యతలను భారత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ 2021లో ఎయిర్‌ ఇండియాను తిరిగి టాటా గ్రూప్‌కు విక్రయించింది. 

టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'ఫ్లాష్ సేల్'ను ప్రారంభించింది. ఈ ఆఫర్ ప్రకారం టిక్కెట్లు రూ. 1,037 నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ టిక్కెట్లు AirIndiaExpress.com, Air India Express మొబైల్ యాప్, ఇతర ప్రధాన బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

Latest Videos

ప్రత్యేక తగ్గింపు ఇలా..
ఇది కాకుండా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. .com ద్వారా బుకింగ్ చేసుకునే కస్టమర్‌లు ప్రత్యేక తగ్గింపులతో జీరో చెక్-ఇన్ బ్యాగేజీ ఎక్స్‌ప్రెస్ లైట్ ఛార్జీల వంటి ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ. 1,000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ. 1,300 నుండి చెక్-ఇన్ బ్యాగేజీ కోసం అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కూడా ఈ ఛార్జీలో ఉంది.

ఇది పరిమిత ఆఫర్..
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది పరిమిత ఆఫర్. ఆగస్టు 26 మరియు అక్టోబర్ 24 మధ్య ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. కామ్, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వారికి తక్కువ ధరకే టిక్కెట్లు లభిస్తాయి. ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడిన ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు అమ్ముడైతే, సాధారణ ఛార్జీలు, షరతులు వర్తిస్తాయని కూడా ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. 
 

click me!