కారు హెడ్‌ లైట్స్‌ ఆఫ్‌ చేయడం మర్చిపోతున్నారా.. ఇలా చేస్తే ప్రాబ్లమ్స్‌ రావు

By Naga Surya Phani Kumar  |  First Published Aug 25, 2024, 4:36 PM IST

కారులో ట్రావెల్‌ చేసినప్పుడు చాలా మంది పొరపాటున హెడ్ లైట్స్‌ ఆన్‌ చేసి వదిలేస్తుంటారు.  ఇది ఎంత ఇబ్బందో తెలుసా.. ఒక్కోసారి మీ జర్నీ మొత్తం డిస్టర్బ్‌ అవుతుంది. కారు పార్క్‌ చేసిన తర్వాత పొరపాటున హెడ్‌లైట్స్‌ ఆన్‌ చేసి వదిలేస్తే వచ్చే సమస్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
 


ప్రస్తుత కాలంలో కారు ఓ నిత్యావసర వస్తువు. ధనవంతులకు లగ్జరీ కార్లు ఎంత అవసరమో మధ్యతరగతి వారికి బడ్జెట్‌లో ఉండే కార్లు ఇప్పుడు అంతే అవసరంగా మారాయి. కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టనిదే కారు కొనలేని పరిస్థితి. మరి ఇంత పెట్టే కొంటే దాన్ని సరిగా మెయిన్‌టెయిన్‌ చేయడంలో పొరపాట్లు జరిగితే రెట్టింపు ఇబ్బందులు తప్పవు. కారు ఆపేసిన తర్వాత హెడ్ లైట్స్ ఆన్ చేసి వదిలేస్తే వచ్చే కొన్ని సమస్యలు, వాటికి పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇంజిన్ స్టార్ట్ అవ్వదు..
కారు పార్క్‌ చేసి ఉన్నప్పుడు హెడ్ లైట్స్ ఎక్కువ సేపు అంటే సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు ఆన్‌ చేసి ఉంటే కారు ఇంజన్‌ స్టార్ట్ కాదు. బ్యాటరీ రీచార్జ్ చేసి స్టార్ట్‌ చేయాలి. లేదంటే కొత్త బ్యాటరీ తెచ్చి అమర్చాలి. 

Latest Videos

బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. 
హెడ్ లైట్స్ బాగా ఎక్కువ పవర్ తీసుకుంటాయి. కారు ఆపేసిన తర్వాత అవి ఆన్ చేసి వదిలేస్తే బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవుతుంది. ఎక్కువసేపు అలాగే ఉంటే బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. 

బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది..
కారు ఆపేసిన తర్వాత తరచూ హెడ్‌లైట్స్‌ ఆన్ చేసి వదిలేస్తే బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది. అంటే బ్యాటరీని త్వరగా మార్చుకోవలసి రావచ్చు.

ఆల్టర్నేటర్‌పై భారం..
ఆల్టర్నేటర్‌ అనేది కారులోని బ్యాటరీతో సహా ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు పవర్‌ను సప్లై చేస్తుంది. హెడ్‌ లైట్స్‌ ఆన్‌ చేసి ఉంచడం వల్ల పవర్‌ మొత్తం బ్యాటరీ తీసేసుకుంటుంది. బ్యాటరీ డిశ్ఛార్జ్‌ అయిపోతే ఆ భారం అంతా ఆల్టర్నేటర్‌పై పడుతుంది. దీంతో కారులోని ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలైన ఏసీ, పవర్‌ విండోస్‌, రేడియో, టచ్‌ స్క్రీన్‌కు పవర్‌ రాదు. వాటిని పవర్‌ ఇచ్చేందుకు ఆల్టర్నేటర్‌ తీవ్రంగా ప్రయత్నించి అది కూడా ఫెయిల్‌ అవుతుంది. దీంతో కారు స్టార్ట్‌ కాదు. 

కొన్ని కారుల్లో ఆటోమెటిక్‌ సిస్టమ్‌..
రూ.30 లక్షల పైన ధర పలికే లగ్జరీ కారుల్లో ఆటోమెటిక్‌ సిస్టమ్‌ ఉంటుంది. పొరపాటున లాక్‌ చేయకపోయినా, లైట్స్‌ ఆఫ్‌ చేయకపోయినా 5, 10 నిమిషాల తరువాత ఆటోమెటిక్‌గా ఆఫ్‌ అయిపోయి, లాక్‌ అయిపోతాయి. ఇది బడ్జెట్‌ కారుల్లో ఉండకపోవచ్చు. కనుక కచ్చితంగా కారు పార్క్‌ చేసిన తర్వాత లైట్స్‌ ఆఫ్‌ చేశామో లేదో చెక్‌ చేసుకోవాలి. దీంతో పాటు విండోస్‌ క్లోజ్‌ చేయడం, డోర్స్‌ సరిగా వేశామో లేదో చెక్‌ చేసుకోవడం తప్పనిసరి. 

కారును నెట్టి స్టార్ట్ చేయాలి.. 
పొరపాటున కారు హెడ్ లైట్స్  ఆన్ చేసి వదిలేయడం వల్ల కారు స్టార్ట్ కాకపోతే ఫస్ట్ గేరు వేసి క్లచ్ తొక్కి పట్టుకోవాలి. కొందరు కారును నెట్టడం ద్వారా ఇంజిన్ ను స్టార్ట్ చేయవచ్చు. అయితే ఇది అత్యవసర పరిస్థితుల్లోనే చేయాలి. ప్రతిసారి  ఇలా చేస్తే ఇంజిన్, బ్యాటరీ మొత్తానికి పాడయ్యే ప్రమాదం ఉంటుంది. వెంటనే మీ కారు సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లడం మంచిది.

click me!