AI రాబోయే 10 ఏళ్లలో 90 శాతం ఉద్యోగాలను తొలగించవచ్చు: ప్రముఖ ఇన్వెస్టర్ కునాల్ షా అంచనా..

Published : Sep 08, 2023, 04:47 PM IST
AI రాబోయే 10 ఏళ్లలో 90 శాతం ఉద్యోగాలను తొలగించవచ్చు: ప్రముఖ ఇన్వెస్టర్ కునాల్ షా అంచనా..

సారాంశం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రాబోయే 10 ఏళ్లలో 90 శాతం ఉద్యోగాలను తొలగించవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్ కునాల్ షా అంచనా వేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 10 సంవత్సరాలలో ఉద్యోగాలకు ముప్పుగా మారవచ్చు. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా తెలిపారు. ముంబైలో జరిగిన 'గ్లోబల్ ఫించ్ ఫెస్ట్'లో షా ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం మనం ఏఐ ముప్పును  గుర్తించలేకపోతున్నామని ఆయన అన్నారు.

AI అంటే కేవలం చాట్ GPT అని మాత్రమే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అయితే దాని దీర్ఘకాలిక పరిణామాలను అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. అయితే ఈరోజు ఉద్యోగం చేస్తున్న 90 శాతం మందికి వచ్చే 10 ఏళ్లలో ఉద్యోగాలు ఉండవని లేదా వారి ఉద్యోగాలకు అర్థం ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలను అని షా హెచ్చరించారు. 

మనల్ని మనం మరింత సమర్థవంతంగా మార్చుకోవడంలో వెనుకబడి ఉన్నామని షా అన్నారు. షా మాట్లాడుతూ, 'నేను ఒక క్లోన్‌ను సృష్టించకుండానే 10 కంపెనీలను స్థాపించగలగాలి. నేను ఇంకా ఏ AI కంపెనీలలో పెట్టుబడి పెట్టలేదు ఎందుకంటే వాటిలో దేనిలోనూ మంచి నాణ్యత కనిపించలేదు. భారతదేశం మంచి AI కంపెనీలను ఉత్పత్తి చేయగలదని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో అలాంటి మంచి కంపెనీలను చూస్తామని ఆయన పేర్కొన్నారు.

అయితే, పెట్టుబడి లేకుండా స్టార్టప్ యూనిట్లను నడపలేమని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నందున భారతీయ స్టార్టప్‌లు కఠినమైన పోటీని ఎదుర్కోబోతున్నాయని ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై .షా మరింత మాట్లాడుతూ, 'ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీలను ప్రోత్సహించాలని నేను భావిస్తున్నాను. బదులుగా మూలధన నిల్వలను కలిగి ఉన్నవారిని మేము అభినందిస్తున్నామని అన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు