
నేటి కాలంలో, మనకు ముఖ్యమైన డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయి. అవి లేకుంటే మన పనులు చాలా వరకు నిలిచిపోతాయి. వీటిలో ఒకటి ఆధార్ కార్డ్. మీరు బ్యాంకులో ఖాతా తెరవాలన్న, సిమ్ కార్డు పొందాలన్న, మీ గుర్తింపును వెల్లడించాలన్న, రుణం తీసుకోవాలన్న, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్న, పాఠశాలలో అడ్మిషన్ తీసుకోవాలన్న ఇలాంటి ఎన్నో పనులకు మీ ఆధార్ కార్డు చాలా ముఖ్యం. ఆధార్ కార్డుని భారత పౌరులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాచే జారీ చేయబడుతుంది. దీనిలో డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది. ప్రజలు ఆధార్ కార్డ్‌లో ఏదైనా సమాచారం అప్‌డేట్ చేయాలనుకున్నప్పుడు, దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో చేయలేకపోతుంటారు. ఉదాహరణకు, చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరును ఆధార్‌లో వారి పేరుతో అప్‌డేట్ చేయాలనుకుంటున్నారు. ఇందుకు చేయాల్సిన ప్రక్రియ గురించి ఏంటంటే..?
ముందుగా అఫిడవిట్ కావాలి
వివాహమైన తర్వాత ఒక మహిళ తన ఆధార్ కార్డులో భర్త ఇంటిపేరును చేర్చలనుకుంటే, ఆమె కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి. ఇందులో ఆమె ఆధార్ లో ఎందుకు మార్పు చేయాలనుకుంటుందో కారణం చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆమోదించిన వెంటనే మార్పులు చేయవచ్చు.
స్టెప్ 1
మీరు మీ ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును అప్‌డేట్ చేయాలనుకుంటే, దీని కోసం మీరు కోర్టు ఆమోదించిన అఫిడవిట్ పొంది ఉండాలి. ఇంటిపేరును అప్ డేట్ చేయడానికి అఫిడవిట్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. కాబట్టి మీ దగ్గర దానిని జాగ్రత్తగా ఉంచుకోండి.
స్టెప్ 2
దీని తర్వాత మీరు మీ ఆధార్ కార్డును మీ వద్ద ఉంచుకోవాలి. దీనితో పాటు మీకు మీ భర్త ఆధార్ నంబర్ అవసరం ఇంకా మీ నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా జతచేయాలి.
స్టెప్ 3
దీని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అఫిడవిట్‌తో జత చేయండి. ఇప్పుడు మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి, అక్కడ మీరు ఆధార్ కార్డులో ఇంటిపేరును అప్ డేట్ చేయాలి అని అధికారికి చెప్పాలి.
స్టెప్ 4
ఇప్పుడు మీరు మీ అన్ని డాక్యుమెంట్స్ అధికారికి ఇచ్చి, ఆపై నిర్ణీత రుసుము చెల్లించాలి. మీ సమాచారాన్ని తీసుకున్న తర్వాత మీ భర్త ఇంటిపేరు ఆధార్ కార్డ్‌లో అప్ డేట్ చేయబడుతుంది అలాగే అప్ డేట్ చేయబడిన ఆధార్ కార్డ్ మీ అడ్రస్ కి పంపబడుతుంది.