Aether Industries Listing: ఏథర్ ఇండస్ట్రిస్ బంపర్ లిస్టింగ్, ఒక్కో షేరుపై రూ.64 లాభం...ఇన్వెస్టర్లకు పండగ..

Published : Jun 03, 2022, 01:48 PM IST
Aether Industries Listing:  ఏథర్ ఇండస్ట్రిస్ బంపర్ లిస్టింగ్, ఒక్కో షేరుపై రూ.64 లాభం...ఇన్వెస్టర్లకు పండగ..

సారాంశం

Aether Industries Listing Today:ఏథర్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ ఇన్వెస్టర్లను సంతోషపెట్టింది. లిస్టింగ్ అనంతరం ఈ షేరు 10% రాబడిని ఇచ్చింది. ఏథర్ ఇండస్ట్రీస్ IPO కింద, షేర్ ధర రూ. 642 కాగా, బిఎస్‌ఇలో రూ.706 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే, ఇన్వెస్టర్లు లిస్టింగ్‌పై 10 శాతం రాబడిని పొందారు.

Aether Industries Listing Today: స్పెషాలిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం ఏథర్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్‌లో పాజిటివ్ లిస్టింగ్‌ తో మదుపరులకు లాభాలను అందించింది. ఐపీఓ ఆఫర్ ప్రైజ్ కింద షేరు ధర రూ.642 కాగా, బీఎస్ఈలో రూ.706 వద్ద లిస్టైంది. అంటే, ఇన్వెస్టర్లు లిస్టింగ్‌లో ఒక్కో షేరుకు 10 శాతం లేదా రూ.64 రాబడిని పొందారు. రూ. 808 కోట్ల ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇష్యూ మొత్తం 6.26 రెట్లు సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ప్రస్తుతం, స్టాక్‌ను లిస్టింగ్ చేసిన తర్వాత, పెట్టుబడిదారులు అందులో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏమి చేయాలి?
స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ అంచనా ప్రకారం ఇప్పటికే మీకు షేర్లు అలాట్ మెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ స్టాక్‌ను మీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ కాలం ఉంచుకోవడం మేలు అని రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. మరోవైపు, కొత్త పెట్టుబడిదారులు ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. లిస్టింగ్ లాభాల కోసం పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు స్టాప్ లాస్‌ను రూ.675 వద్ద ఉంచుకొని హోల్డ్ చేయాలి. మార్కెట్‌లోని సెంటిమెంట్‌లు మెరుగుపడటం, ఇష్యూకి మెరుగైన స్పందన రావడంతో స్టాక్‌ లిస్టింగ్‌ సానుకూలంగా మారిందని ఆయన అంటున్నారు. స్పెషాలిటీ కెమికల్స్ విభాగంలో కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ మార్కెట్లో భారతీయ రసాయన పరిశ్రమ వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉంది
ఈథర్ ఇండస్ట్రీస్ IPO మే 24-26 మధ్య సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంది. మొత్తం మీద ఈ షేర్ 6.26 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూలో  QIBల కోసం రిజర్వు చేయబడిన గరిష్ట వాటా 17.57 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. NIIలు (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) కోసం రిజర్వు చేయబడిన షేర్ 2.52 రెట్లు కాగా, రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు, ఉద్యోగులు 1.06 రెట్లు సబ్‌స్క్రైబ్ పొందారు. ఐపీఓ కింద ఒక్కో షేరు ధర రూ.610-642గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 23 షేర్లుగా నిర్ణయించారు. 

కంపెనీ గురించిన వివరాలు
ఏథర్ ఇండస్ట్రీస్ ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుంది. 4MEP, MMBC, OTBN, N-octyl-D-glucamine, Delta-valerectone, Bifenthrin ఆల్కహాల్ వంటి కొన్ని రసాయనాలను తయారు చేస్తున్న దేశంలో ఇది ఏకైక కంపెనీగా పేరుంది. సెప్టెంబర్ 2021 నాటికి, కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 22 ఉత్పత్తులను కలిగి ఉంది, వీటిని 17 కంటే ఎక్కువ దేశాలలో 30 కంపెనీలకు మరియు 100 కంటే ఎక్కువ దేశీయ కంపెనీలకు విక్రయించారు.

కంపెనీ ఆర్థిక అంశాలు
కంపెనీ ఆర్థికాంశాల గురించి చెప్పాలంటే, దాని నికర లాభం (పన్ను తర్వాత లాభం) నిరంతరం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 23.33 కోట్లు, 2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 39.96 కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 71.12 కోట్లు మరియు 2022 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ 2021 వరకు) రూ. 82.91 కోట్లుగా నమోదైంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !