Gold Prices Today: మహిళలకు బ్యాడ్ న్యూస్ పెరుగుతున్న బంగారం ధరలు...ఎంత పెరిగిందో తెలిస్తే షాకే...

Published : Jun 03, 2022, 11:31 AM ISTUpdated : Jun 03, 2022, 11:35 AM IST
Gold Prices Today: మహిళలకు బ్యాడ్ న్యూస్ పెరుగుతున్న బంగారం ధరలు...ఎంత పెరిగిందో తెలిస్తే షాకే...

సారాంశం

Gold Rates Today: బంగారం కొనాలని భావించే వారికి చేదువార్త. నెల ఆరంభం నుంచి పసిడి రేటు పెరుగుతూ వస్తోంది. పుత్తడి రేటు వరుసగా మూడో రోజు కూడా స్వల్పంగా పెరిగింది. 

ప్రపంచవ్యాప్తంగా బంగారం-వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి.  రూపాయి పతనం కారణంగా, నేడు, జూన్ 3, శుక్రవారం, దేశీయ మార్కెట్‌లో బంగారం పెరిగింది. ఈరోజు బంగారం ధర పది గ్రాములకు రూ.434 పెరిగింది. ఈ విజృంభణ కారణంగా ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ఖరీదు పెరిగి పది గ్రాముల ధర రూ.50,887కి చేరింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అందించిన సమాచారం ప్రకారం గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.50,453 వద్ద ముగిసింది.

జూన్ 3న హైదరాబాద్‌లో 22 కేరట్ల ఆర్నమెంటల్ బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 47,500కు క్షీణించింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో పది గ్రాములకు గానూ రూ. 50,820కు పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా దాదాపు ఇదే రేట్లు కొసాగుతున్నాయి.

వెండి ధరలో పెరుగుదల
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. ఈరోజు దీని ధర కిలోకు రూ.918 పెరిగింది.ఈ జంప్ కారణంగా ఈరోజు ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.61,776కి చేరుకుంది. ఒక రోజు క్రితం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.60,858 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
గురువారం, US డాలర్‌తో రూపాయి 10 పైసలు క్షీణించి 77.60  వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,852 డాలర్లు, వెండి కూడా స్వల్పంగా పెరిగి ఔన్సు ధర 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ మాట్లాడుతూ, "కామెక్స్‌లో గురువారం బంగారం ధరలు 0.32 శాతం పెరిగి ఔన్స్‌కు 1,852 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ బలహీనంగా ఉండడంతో బంగారం ధరలు పెరిగాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !