ఈ వార్తలపై Paytm ప్రతినిధి మాట్లాడుతూ, "ఈ వార్త కేవలం ఊహాగానాలేనని, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి చర్చలలో పాల్గొనలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము." అని తెలిపారు.
RBI విధించిన ఆంక్షల తర్వాత Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ కొద్దీ రోజులుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే, ఇప్పుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వన్97 కమ్యూనికేషన్స్‌లో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, Paytm ఈ విషయం పై సమాచారం ఖండించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, Paytm వ్యవస్థాపకుడు అండ్ CEO విజయ్ శేఖర్ శర్మ మే 28న అదానీ గ్రూప్ ఛైర్మన్‌ను "డీల్ విధివిధానాలను ఖరారు చేయడానికి" అహ్మదాబాద్‌కు వెళ్లారు అని తెలిపింది.
అయితే ఈ వార్తలపై Paytm ప్రతినిధి మాట్లాడుతూ, "ఈ వార్త కేవలం ఊహాగానాలేనని, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి చర్చలలో పాల్గొనలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము." అని తెలిపారు.
పోర్ట్స్ నుంచి విమానాశ్రయాల వరకు వ్యాపారం చేసే అదానీ గ్రూప్ ఈ డీల్‌తో ఫిన్‌టెక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తే, గూగుల్ పే, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే అలాగే ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ వంటి కంపెనీలతో పోటీపడుతుంది. అంతే కాకుండా, అంబుజా సిమెంట్స్ ఇంకా NDTV తర్వాత అదానీ గ్రూప్ మరో పెద్ద డీల్ ఇది.
వన్97 కమ్యూనికేషన్స్‌లో విజయ్ శేఖర్ శర్మకు దాదాపు 19 శాతం వాటా ఉంది. మే 28 క్లోసింగ్ ధర ప్రకారం, ఈ వాటా విలువ దాదాపు రూ.4,218 కోట్లు. విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగతంగా Paytmలో 9 శాతం వాటాతో ఉన్నారు అలాగే విదేశీ కంపెనీ రెసిలెంట్ అసెట్ మేనేజ్‌మెంట్ ద్వారా పరోక్షంగా 10 శాతం వాటాతో ఉన్నారు. One97 కమ్యూనికేషన్స్ ఫైలింగ్స్‌లో, శర్మ అండ్ రెసిలెంట్ ఇద్దరూ పబ్లిక్ షేర్‌హోల్డర్‌లుగా లిస్ట్ చేయబడ్డారని నివేదిక పేర్కొంది.
నిబంధనలను పదేపదే ఉల్లంఘించడం, రూల్స్ పాటించడం లేదని పేర్కొంటూ ఈ ఏడాది జనవరి 31న, Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై RBI వ్యాపార పరిమితులను విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత పిపిబిఎల్ కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా ఇంకా క్రెడిట్ లావాదేవీలను నిర్వహించకుండా RBI నిషేధించింది.