టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దది; తొలి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద షిప్..

By Ashok kumar Sandra  |  First Published Jan 26, 2024, 3:20 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటిల్‌ ఉన్న ఐకాన్ ఆఫ్ ది సీస్ 1,200 అడుగుల పొడవు అండ్ 2,50,800 టన్నుల బరువు   ఉన్నట్లు నివేదించబడింది. ఈ లగ్జరీ షిప్‌లో ఒకేసారి 5610 నుంచి 7600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.  


ప్రపంచంలోనే అతి పెద్ద క్రూయిజ్ షిప్ ఏంటో తెలుసా ? 'ఐకాన్ ఆఫ్ ది సీస్' అనే లగ్జరీ క్రూయిజ్ షిప్. ఈ షిప్  జనవరి 27 నుంచి  తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటి వరకు ఈ క్రూయిజ్ షిప్ పేరు 'వండర్ ఆఫ్ ది సీస్'. అయితే ఇది టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దదని ఐకాన్ ఆఫ్ ది సీస్ మేకర్ రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ టైటిల్‌ ఉన్న ఐకాన్ ఆఫ్ ది సీస్ 1,200 అడుగుల పొడవు అండ్ 2,50,800 టన్నుల బరువు   ఉన్నట్లు నివేదించబడింది. ఈ లగ్జరీ షిప్‌లో ఒకేసారి 5610 నుంచి 7600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.  దినిలో  20 అంతస్తులు ఉన్నాయి. రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ మీ వెకేషన్‌ను పూర్తి చేయడానికి ఇంతకంటే మంచి ప్రదేశం లేదని చెప్పింది.  

Latest Videos

ది సన్ ప్రకారం, షిప్ ధర దాదాపు 2 బిలియన్ డాలర్లు(200 కోట్లు). 20 అంతస్తుల్లోని  18 అంతస్తులు ప్రయాణికులకు కేటాయించబడ్డాయి. క్రూయిజ్‌లో 40 రెస్టారెంట్లు, బార్‌లు ఇంకా లాంజ్‌లు ఉన్నాయి. ఆరు 55 అడుగుల వాటర్ ఫాల్స్ ఇంకా ఏడు స్విమ్మింగ్  పూల్స్ ఉన్నాయి. ప్రయాణికులకు 2,350 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్‌లో ప్రయాణించడం విలాసవంతమైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పశ్చిమ కరేబియన్‌లో 7 రాత్రులను కవర్ చేస్తూ, ఈ ప్రయాణం ఫ్లోరిడాలోని మీయామిలో ప్రారంభమవుతుంది. జనవరి 10, 2024న,   మొదటిసారిగా మయామి నౌకాశ్రయంలోకి ప్రవేశించింది, అక్కడ నుండి అది   తొలి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. రాయల్ కరీబియన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ యాత్రకు ఒక్కొక్కరికి 1.5 నుండి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే సీజన్‌ను బట్టి ధర మారవచ్చు.

click me!