"అదృష్టవశాత్తూ, బ్యాంకులో తక్కువ కస్టమర్ బేస్ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది" అని బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌరవ్ సింగ్ చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉనావో జిల్లాలోని షాహ్‌గంజ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లోకి బుధవారం ఓ ఎద్దు ప్రవేశించింది. దీంతో బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన 30 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎద్దుపై కర్రతో కొట్టడం వీడియోలో చూడవచ్చు. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
వీడియోలో, ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించి ఒక మూలలో నిలబడి ఉంది. తరువాత కౌంటర్ నుండి ముందుకి దాటివెళ్తుంది. అకస్మాత్తుగా ప్రవేశించిన ఎద్దును చూసి ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
అదే సమయంలో బ్యాంకు సెక్యూరిటీ గార్డు ప్రజలను వెనక్కి రమ్మని చెప్పి ఎద్దుని ఓ కర్రతో తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాంకు ఆవరణ బయట మరో ఎద్దుతో పోరాడి ఈ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించిందని చెబుతున్నారు.
"అదృష్టవశాత్తూ, బ్యాంకులో తక్కువ కస్టమర్ బేస్ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది" అని బ్యాంక్ చీఫ్ మేనేజర్ గౌరవ్ సింగ్ చెప్పారు.
గతేడాది అసోంలోని ధుబ్రీ జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లోని ఓ బట్టల దుకాణంలో ఆవు స్వేచ్ఛగా సంచరించింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
उन्नाव- उन्नाव में SBI बैंक में घुसा सांड, बैंक में कैस काउंटर पर पहुंचा सांड
➡बैंक में सांड घुसने से बैंक में हड़कंप
➡वीडियो सोशल मीडिया पर वायरल
➡शहर के शाहगंज शाखा का मामला.
pic.twitter.com/LOef59r1xd