Gold Silver Rate: 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.2700 తగ్గింది, సోమవారం బంగారం ధరలు ఇవే..వెంటనే తెలుసుకోండి..

Published : Feb 20, 2023, 08:36 AM IST
Gold Silver Rate: 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.2700 తగ్గింది, సోమవారం బంగారం ధరలు ఇవే..వెంటనే తెలుసుకోండి..

సారాంశం

బంగారం షాపింగ్ కు వెళ్తున్నారా, అయితే వెంటనే ఈరోజు ధరలను చెక్ చేసుకోండి. ఎందుకంటే బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో మీరు లాభం పొందే అవకాశం ఉంది. కనుక వెంటనే నేటి ధరలను చెక్ చేసుకుని షాపింగ్ వెళ్ళండి.

బంగారం, వెండిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు చాలా  ముఖ్యమైన వార్త ఉంది. 10 గ్రాముల బంగారాన్ని రూ. 2700 తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. గత కొన్ని వారాలుగా, బంగారం ,  వెండి ధరలలో స్థిరమైన పెరుగుదల నమోదవుతోంది. అయితే గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లిళ్ల సీజన్‌లో అందరి చూపు నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ట్రెండ్‌పైనే ఉంది.

సోమవారం 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 తగ్గి,  రూ. 56175 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 51 వేల వద్ద ట్రేడ్ అవుతోంది.  హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 55,900 వద్ద పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,240. వద్ద పలుకుతోంది. 

అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఒక ఔన్సు,  అంటే 31 గ్రాముల బంగారం ధర  అమెరికాలో 1827 డాలర్లుగా పలుకుతుంది.  ఈ స్థాయి నుంచి బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది దీంతో రిటైల్ బంగారం ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి ముఖ్యంగా డాలర్ బలం పుంజుకోవడంతో మధుపరులు చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు.  డాలర్ బలోపేతం అయ్యే కొద్ది, బంగారం ధర పతనమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మీరు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇది సరైన సమయం అని చెప్పవచ్చు.  ధర తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నట్లయితే భవిష్యత్తులో భారం పడకుండా ఉంటుంది. 

మరోవైపు, సోమవారం, వెండి ధర కూడా మెత్తబడింది. సోమవారం కిలో వెండి ధర రూ.889 తగ్గి రూ.64500 వద్ద ముగిసింది. కాగా, గత వారం చివరి ట్రేడింగ్ రోజున వెండి ధర రూ.431 తగ్గి కిలోకు రూ.65389 వద్ద ముగిసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !
Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !