బడ్జెట్‌ను సమర్పించిన వెంటనే భారతీయ స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా మారింది. నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని పాజిటివ్ గా తీసుకున్నాయి. దీంతో దేశీయ సూచీలు దూసుకుపోతున్నాయి.
బడ్జెట్‌ను సమర్పించిన వెంటనే భారతీయ స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా మారింది. సెన్సెక్స్ 1076 పాయింట్లు ఎగబాకగా, ప్రస్తుతం ఇండెక్స్ 1.81 శాతం లాభంతో 60,625.97 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ 283 పాయింట్ల లాభంతో 17,945.55 వద్ద ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 4% పైగా పెరిగాయి, టాటా స్టీల్ షేర్లు 3.51% లాభపడ్డాయి, లార్సెన్ & టూబ్రో 3%, హెచ్‌డిఎఫ్‌సి 3.12% మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2.84% పెరిగాయి.