బడ్జెట్ 2004 - 25 టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు

By Shivaleela Rajamoni  |  First Published Feb 1, 2024, 9:45 AM IST

Union Budget 2024: ఈ రోజే 2024- 25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకే.. మొదటి బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎవరు ప్రవేశ పెట్టారు? వంటి.. బడ్జెట్ గురించి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


Union Budget 2024: ఫిబ్రవరి 1 న అంటే ఈ రోజే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు తెలుసా?  1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం చెట్టి స్వతంత్ర భారత తొలి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇకపోతే కరోనా కారణంగా 2021 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ తొలి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ను వరుసగా ఆరో సారి ప్రవేశపెట్టిన తొలి మహిళ ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 6 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా దీని గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

1. భారతదేశపు మొదటి బడ్జెట్ ను 1860 ఏప్రిల్ 7 న బ్రిటిష్ పాలనలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను ఈస్టిండియా కంపెనీ ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. జేమ్స్ విల్సన్ దీనిని బ్రిటిష్ క్రౌన్ కు బహూకరించారు.

Latest Videos

2. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 నుంచి 1949 వరకు.. స్వతంత్ర భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రిగా ఆర్కె షణ్ముఖం చెట్టి  పనిచేశారు. కాగా ఈయనే 1947 నవంబర్ 26 న మొదటి బడ్జెట్ ను  ప్రవేశపెట్టారు.

3. మీకు తెలుసా? మొరార్జీ దేశాయ్ ఏకంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు . అలాగే మోరార్జీ దేశాయ్ తన పుట్టిన రోజు సందర్భంగా అంటే ఫిబ్రవరి 29న రెండుసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఒకటి లీప్ ఇయర్ అయిన 1964లో, ఇంకోటి 1968 లో ప్రవేశపెట్టారు.

4. 21 సెప్టెంబర్ 2016 న రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

5. 2016 నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించింది. ఈ సమయంలో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ఉన్నారు.  అలాగే 2017లో రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో విలీనం చేశారు. స్వతంత్ర భారతావనిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన తొలి ఉమ్మడి బడ్జెట్ ఇది. దీంతో 92 ఏండ్ల సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి తెరపడింది.

6. మీకు తెలుసా? 2016 వరకు కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి చివరి పనిదినం నాడే ప్రవేశపెట్టేవారు. కాగా ఈ రోజుకు మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017లో ఫిబ్రవరి 1గా మార్చారు.

7. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే? జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మాత్రమే ప్రధానులుగా ఉన్నప్పుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫస్ట్ పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా కారణంగా ఇలా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 

8. 1999 వరకు కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రకటించేవారు. మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా దానిని ఉదయం 11 గంటలకు మార్చారు.

9. బడ్జెట్ చుట్టూ గోప్యత పాటించడానికి 'హల్వా వేడుక' తర్వాత లాక్-ఇన్ అనుసరిస్తారు. అయితే 1950లో కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకు రాష్ట్రపతి భవన్ లోనే బడ్జెట్ ముద్రణ జరిగేది. లీకేజీ తర్వాత దాన్ని న్యూఢిల్లీలోని మింటో రోడ్డులోని ప్రెస్ కు తరలించాల్సి వచ్చింది. అలా 1980లో నార్త్ బ్లాక్ లోని బేస్ మెంట్ లో ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

10. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు.

కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారు?

కేంద్ర బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వివరాలను అందించే ఆర్థిక పత్రం. కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వ ఆర్థిక విధానాలు, కార్యక్రమాల వివరాలు కూడా ఉంటాయి. కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసి విశ్లేషిస్తారు. కేంద్ర బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థపై, ప్రజల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన భాగం.

click me!