ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.. ఆర్థిక మంత్రి లోక్ సభలో బడ్జెట్ 2023-24 ప్రసంగాన్ని చేస్తున్నారు.

12:23 PM (IST) Feb 01
7 లక్షల లోపు ఆదాయం వున్నవారికి ఇన్కమ్ ట్యాక్స్ నుండి రిలీఫ్
12:14 PM (IST) Feb 01
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకకు కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించారు. కర్ణాటకలో వెనకబడ్డ ప్రాంతాల్లో సాగు రంగ అభివృద్దికి రూ.5,300 కోట్లు కేటాయింపు
12:11 PM (IST) Feb 01
మొబైల్ ఫోన్స్, టివి తయారీ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
12:09 PM (IST) Feb 01
హార్టీకల్చర్ కు రూ.2220 కోట్లు కేటాయింపు
11:59 AM (IST) Feb 01
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ.7 వేల కోట్లు కేటాయింపు
11:54 AM (IST) Feb 01
ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన్ కింద రానున్న 3 ఏళ్లలో 10 లక్షల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్... దేశవ్యాప్తంగా కొత్తగా 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు
11:54 AM (IST) Feb 01
ప్రధాన మంత్రి కౌశల వికాస్ యోజన్ కింద రానున్న 3 ఏళ్లలో 10 లక్షల నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్... దేశవ్యాప్తంగా కొత్తగా 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు
11:49 AM (IST) Feb 01
గోబర్దన్ స్కీమ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు.. రూ.10 వేల కోట్లు
11:45 AM (IST) Feb 01
రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూ.13 లక్షల కోట్లు
11:44 AM (IST) Feb 01
అర్బన్ ఇన్ ఫ్రా పండ్ కింద ఏడాదికి రూ.10వేల కోట్లు కేటాయింపు
11:42 AM (IST) Feb 01
20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు రైతులకు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
11:41 AM (IST) Feb 01
దేశంలోని 50 విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్దికి చర్యలు
11:39 AM (IST) Feb 01
రైల్వే కు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు
11:38 AM (IST) Feb 01
దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు
11:35 AM (IST) Feb 01
పీఎం ఆవాస్ యోజనకు 79 వేల కోట్లు కేటాయింపు
11:34 AM (IST) Feb 01
కరువు ప్రాంత రైతులకు రూ.5,300 కోట్లు కేటాయింపు
11:30 AM (IST) Feb 01
ప్రధాన మంత్రి పివిటిజి యోజన్ రూ.15 వేల కోట్లు కేటాయింపు... అలాగే గిరిజన విద్యార్థులు చదువుకునే 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్ 38,800 టీచర్స్ పోస్టుల నియామకం
11:23 AM (IST) Feb 01
క్లీన్ ప్లాంగ్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు కేటాయింపు
11:22 AM (IST) Feb 01
రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
11:19 AM (IST) Feb 01
పీఎం మత్స్య సంపద యోజన్ 6000 కోట్లు కేటాయింపు
11:17 AM (IST) Feb 01
అగ్రి స్టార్ట్ అప్ కోసం అగ్రికల్చర్ ఆక్సిలరేటర్ ఫండ్ ఏర్పాటు చేసి యువ రైతులకు అవకాశం
11:14 AM (IST) Feb 01
టూరిజం అభివృద్ది మిషన్ మోడ్ లో పనిచేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్రాలను కలుపుకుపోతూ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ది చేయాలనుకుంటున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
11:07 AM (IST) Feb 01
తొమ్మిదేళ్ల బిజెపి పాలనలతో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.
11:02 AM (IST) Feb 01
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ 2023-24 ప్రవేశపెడుతున్నారు.
10:45 AM (IST) Feb 01
బడ్జెట్ 2023-24 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పార్లమెంట్ లోనే మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
10:06 AM (IST) Feb 01
బడ్జెట్ 2023-24 ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ట్యాబ్ తో సీతారామన్ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కు చేరుకుని ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసారు. అక్కడి నుండి నేరుగా పార్లమెంట్ కు చేరుకున్నారు.
10:01 AM (IST) Feb 01
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్ కు చేరుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు.
09:07 AM (IST) Feb 01
బడ్జెట్ 2023-24 కు ఆమోదం తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ లోనే మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
09:02 AM (IST) Feb 01
కరోనా కష్టాలు పూర్తిగా తొలగిపోయిన తర్వాత ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ పై సామాన్యులు గంపెడాశలు పెట్టుకున్నారు. కరోనాతో చితికిపోయిన చిరు వ్యాపారులు, కూలీలు, నిరుపేదలకు ఈ బడ్జెట్ ఏమయినా భరోసా ఇస్తుందేమో చూడాలి.
08:03 AM (IST) Feb 01
బడ్జెట్ 2023-24 లో పారిశ్రామిక రంగానికి భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు ఆర్థిక సర్వే 2023 ని బట్టి అర్థమవుతోంది. అలాగే దేశంలో నిరుద్యోగితను తగ్గించేందుకు ఉపాధి కల్పన పై దృష్టిసారించే అవకాలున్నాయి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, జాతీయ రహదారుల అభివృద్దికి ఈ బడ్జెట్ లో భారీగా నిధులు దక్కే అవకాశాలున్నాయి.
07:30 AM (IST) Feb 01
భారతదేశ బడ్జెట్ 2023-24 ను నేడు కేంద్ర ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే వివిధ రంగాలకు, రాష్ట్రాలకు కేటాయింపులు ఎలా వుండనున్నాయో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.