
Union Budget 2025 : బడ్జెట్ అంటేనే అంకెల గారడి. కాబట్టి చాలామంది విద్యార్థులకు మ్యాథమెటిక్స్ అర్థం కానట్లే బాగా చదువుకుని కూడా ఆర్థిక అంశాలపై అవగాహన లేనివారికి బడ్జెట్ లో వాడే పదాలు అర్థం కావు. ఇక సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే బడ్జెట్ లో ప్రతి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే వుంటుంది... కానీ పదాలు ఆర్థికశాస్త్ర పరిబాషలో వుండటంతో అర్ధం కావు. కాబట్టి బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే ముందు అందులో వాడే పదాలకు అర్థం తెలిసుండాలి. బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే ఇది ఎంతో ముఖ్యం.
కేంద్ర బడ్జెట్ 2025 నేపథ్యంలో దేశ ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ బడ్జెట్ ఎలా వుండనుంది? కేటాయింపులు ఎలా వున్నాయి? తెలుసుకునేముందు బడ్జెట్ లో ఉపయోగించే పదాల గురించి తెలుసుకుందాం.
1. ఆదాయం (Income) :
బడ్జెట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నులతో పాటు ఇతర మార్గాలద్వారా వచ్చే మొత్తం డబ్బులే ఆదాయం. ప్రభుత్వ పాలన మెరుగ్గా సాగాలంటే మంచి ఆదాయం రావాల్సిందే. మన దేశానికి జిఎస్టి వసూళ్లు, ఇతర పన్నులద్వారా ఆదాయం వస్తుంది.
2. ఖర్చు లేదా వ్యయం (Expenditure) :
బడ్జెట్ ప్రకారం పాలనాపరమైన వ్యవహారాల కోసం ప్రభుత్వం వినియోగించే నిధులనే ఖర్చు లేదా వ్యయం అంటారు. ప్రభుత్వానికి రెండురకాల ఖర్చులు వుంటాయి. ఇవి రెండు రకాలుగా వుంటాయి. ఒకటి మూలధన వ్యయం అంటే ఆస్తుల కోసం చేసే ఖర్చులు. దీనివల్ల భవిష్యత్ లో లాభాలు ఆశించవచ్చు. ఇంకోటి రాజ్యాంగ ఖర్చలు అంటే ఉద్యోగులకు వేతనాలు, ప్రజలకు పథకాలు వంటివాటికోసం చేసే ఖర్చులు. ఈ ఖర్చులకు లాభాలను ఆశించలేం.
3. మిగులు (Surplus):
ఆదాయం లోంచి ఖర్చును తీసివేయగా వుండేదే మిగులు. మిగులు ఆదాయం వుందంటే ఆ దేశానికి ఆదాయ వనరులు పుష్కలంగా వున్నాయని అర్థం. ఖర్చులు పోను మిగిలిన ఆదాయాన్ని ప్రజాసంక్షేమం, దేశ అభివృద్ది కోసం ఉపయోగించవచ్చు.
4. లోటు (Dificit) :
ఆదాయమేమో తక్కువగా వుండి ఖర్చులేమో ఎక్కువగా వుంటే దాన్ని లోటు బడ్జెట్ అంటారు. అంటే ఆదాయ వనరులు తక్కువగా వుంటే లోటు ఏర్పడుతుంది. కొన్ని దేశాల్లో పాలనకు సరిపడా ఆదాయం కూడా వుండదు... దీంతో వివిధ ఆర్థిక సంస్థల వద్ద అప్పులు చేస్తుంటారు. లోటు బడ్జెట్ అనేది ఏ దేశానికైనా అంత మంచిది కాదు.
5. రాయితీలు (Subsidies) :
ప్రభుత్వం ఏదయినా రంగాన్నిగాని, సంస్థనుగాని, వ్యక్తులను గాని ప్రోత్సహించేందుకు రాయితీలు ఇస్తుంటారు. అంతే ఆర్థిక భారాన్ని తగ్గించడమే రాయితీ. సాధారణంగా ప్రభుత్వాలు పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి రాయితీలు ఇస్తుంటారు.
6. మూలధనం (Capital) :
భవిష్యత్ లో ఆదాయాన్ని తెచ్చిపెట్టేందుకు ప్రభుత్వం ఉపయోగించే నిధులను మూలధనం అంటారు. ఇలా ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు ముందుగానే మౌళిక సదుపాయాలు కల్పనకు ఖర్చుచేసే నిధులు ఇలాంటివే.
7. ద్రవ్యోల్బనం (Inflation) :
వస్తువులు, సేవల ధరల పెరుగులదనే ద్రవ్యోల్బనం అంటారు. ఇంకా చెప్పాలంటే ధరల పెరుగుదలను జీవన వ్యయంతో పోల్చి ద్రవ్యోల్బనాన్ని నిర్ణయిస్తారు. ధరలు పెరగడంతో డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది.
8. ఆర్థిక విధానం (Piscal Policy) :
ప్రభుత్వం తన ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు తీసుకునే చర్యలను ఆర్థిక విధానాలు అంటారు. అంటే పన్నులు, వడ్డీలు, ప్రభుత్వ ఖర్చులపై తీసుకునే నిర్ణయాలు అన్నమాట. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించి వృద్దిని సాధించడం, ద్రవ్యోల్బనాన్ని నియంత్రించడం, ఉపాధిని పెంచడానికి ఆర్థిక విధానాన్ని రూపొందిస్తాయి ప్రభుత్వాలు.
9. ప్రత్యక్ష,పరోక్ష పన్నులు (Direct and Indirect Tax) :
ఓ వ్యక్తి స్వయంగా ప్రభుత్వానికి చెల్లించె పన్నును ప్రత్యక్షపన్ను అంటారు. ఉదా : ఆదాయ పన్ను
అదే వ్యక్తి ఓ వస్తువును కొన్నపుడు దాని ధరలోనే కొన్ని పన్నులు ఇమిడి వుంటాయి. అంటే అతడిపై ప్రత్యక్షంగా భారం పడకుండానే ప్రభుత్వానికి పన్ను వెళుతుంది.దీన్ని పరోక్ష పన్నుు అంటారు.
10. బడ్జెట్ సాంకేతికలు (Budget Techniques)
బడ్జెట్ సిద్ధం చేసేటప్పుడు ఉపయోగించే వివిధ సాంకేతిక పద్ధతులనే బడ్జెట్ టెక్నిక్స్ అంటారు. ఇందులో ప్రణాళిక బడ్జెట్, ప్రణాళికేతర బడ్జెట్, ప్రణాళిక ప్రణాళికలు ఉంటాయి.