Economic Survey 2022: జీడీపీ వృద్ధి FY22లో 9.2%.. FY23లో 8.5%..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 31, 2022, 02:28 PM IST
Economic Survey 2022: జీడీపీ వృద్ధి FY22లో 9.2%.. FY23లో 8.5%..!

సారాంశం

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జనవరి 31, 2022) లోకసభలో ఆర్థిక సర్వే (ఎక‌నామిక్ సర్వే)ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు సభకు సమర్పిస్తారు. 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జనవరి 31, 2022) లోకసభలో ఆర్థిక సర్వే (ఎక‌నామిక్ సర్వే)ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు సభకు సమర్పిస్తారు. గత ఆర్థిక ఏడాది ఎలా కొనసాగిందో పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్. అలాగే అభివృద్ధి కోసం సూచనలు చేస్తుంది. ఈ సర్వేను సాధారణంగా చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ (CEA) ఆధ్వర్యంలో తయారు చేస్తారు. ఈసారి సీఈవో గైర్హాజరీలో తయారయింది. ఈ సర్వే తయారీ అనంతరం ఇటీవల జనవరి 28న కేంద్రం అనంత నాగేశ్వరన్‌ను కొత్త సీఈఏగా నియమించింది. ఈ ఆర్థిక సర్వేను నిర్మలమ్మ సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సర్వేలో ప్ర‌ధానాంశాలివే.

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం నుండి 8.5 శాతంగా ఉండవచ్చు. FY22లో వ్యవసాయ వృద్ధి 3.9 శాతం, ఇండస్ట్రియల్ వృద్ధి రేటు 11.8 శాతంగా అంచనా వేస్తున్నారు. సరఫరా వైపు సంస్కరణల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కాపెక్స్, ఎక్స్‌పోర్ట్స్ వృద్ధికి కీలకం.

అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. డైరెక్ట్ క్యాష్ ట్రాన్సఫర్ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. 2016 నుండి 60వేల స్టార్టప్స్ పుట్టుకు వచ్చాయని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారత్ వృద్ధిపైన దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Budget 2025: మధ్య తరగతికి భారీ ఉపశమనం, నిర్మలా సీతారామన్ ఎవరికి ఏమిచ్చారో పూర్తి డిటైల్స్
Budget 2025 హైలైట్స్, కొత్త ఆదాయ పన్ను, పూర్తి వివరాలు