Budget 2025లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ Highlights, పన్నులు, ఇతర విశేషాలను తెలుసుకుందాం.

01:23 PM (IST) Feb 01
కొత్త ఆదాయ పన్ను శ్లాబులు
4 లక్షల వరకు - 0%
Rs 4-8 లక్షలు - 5%
Rs 8-12 లక్షలు - 10%
Rs 12-16 లక్షలు - 15%
Rs 16-20 లక్షలు - 20%
Rs 20-24 లక్షలు - 25%
Rs 24 లక్షల పైగా - 30%
12:14 PM (IST) Feb 01
12 లక్షల లోపు ఆదాయం వుంటే ఇన్కమ్ ట్యాక్స్ వుండదు. మధ్య తరగతి వారికి ఊరట కల్పించారు.
12:12 PM (IST) Feb 01
టాక్సేషన్, విద్యుత్, అర్బన్ డెవలప్‌మెంట్, మైనింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ సంస్కరణలు
12:07 PM (IST) Feb 01
ప్రత్యక్ష పన్నులు :
పన్నుల విధానంలో భారీ మార్పుల కోసం బిల్లు.
లిటిగేషన్ తగ్గించేలా ఆదాయపన్ను విధానం
వృద్దులకు జిడిఎస్ ఊరట
వడ్డీపై వచ్చ ఆదాయంపై జిడిఎస్ రూ.50 వేల నుండి రూ. 1 లక్షకు పెంపు
అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు
11:55 AM (IST) Feb 01
ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్డిఐ లకు అనుమతి.
11:54 AM (IST) Feb 01
క్యాన్సర్ మందులపై భారీగా పన్నులు తగ్గింపు.. 36 లైఫ్ సేవింగ్స్ కస్టమ్ డ్యూటీ పూర్తిగా తగ్గింపు... 6 మెడిసిన్స్ కు కస్టమ్ డ్యూటీ 5 శాతం.
11:47 AM (IST) Feb 01
న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వచ్చేవారమే దీన్ని తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
11:45 AM (IST) Feb 01
న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ను వికసిత భారత్ కింద అమలు... 100 gW న్యూక్లియర్ ఎనర్జీ 2047 వరకు సాధించడమే లక్ష్యం.
11:42 AM (IST) Feb 01
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలను 50 ఏళ్ళకు వడ్డీ రహితంగా అందింస్తాం. సంస్కరణలు అమలుచేసే రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తాం.
11:39 AM (IST) Feb 01
టాప్ 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ది... ఉద్యోగాలు కూడా కల్పించే ప్రయత్నం... ముద్ర లోన్స్ కల్పిస్తాం... ఈ-వీసా సదుపాయం కల్పిస్తాం. మెడికల్ టూరిజం అభివృద్ది
11:35 AM (IST) Feb 01
పోర్టు,ఎయిర్ పోర్టుల అభివృద్ది... హెలిప్యాడ్, చిన్న విమానాశ్రయాల ఏర్పాటు... గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ బిహార్ కు... పాట్నా విమానాశ్రయ అభివృద్ది..
11:29 AM (IST) Feb 01
ఎంఎస్ఎంఈ రుణాల పెంపు... రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్లకు పెంపు, స్టార్టప్ లకు రూ.10 కోట్ల నుండి రూ.20 కోట్లు పెంపు
11:24 AM (IST) Feb 01
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 50 వేల ల్యాబ్స్ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్కూళ్లకు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ కల్పించనున్నారు
11:24 AM (IST) Feb 01
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 50 వేల ల్యాబ్స్ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్కూళ్లకు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ కల్పించనున్నారు
11:21 AM (IST) Feb 01
నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటుపై మంత్రి ప్రకటన.
11:21 AM (IST) Feb 01
నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటుపై మంత్రి ప్రకటన.
11:21 AM (IST) Feb 01
బొమ్మలకు గ్లోబల్ హబ్ గా భారత్. మంచి బొమ్మలు తయారుచేసి మేడిన్ ఇండియా బ్రాండ్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నాం.
11:19 AM (IST) Feb 01
5 లక్షల మంది ఎస్సి, ఎస్టి మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు... స్టాండప్ ఇండియాలో భాగంగా రూ.2 కోట్ల వరకు లోన్స్
11:15 AM (IST) Feb 01
తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తోందని మంత్రి తెలిపారు. దేశంలోని 100 జిల్లాల్లో కోటి మంది రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, లోన్ లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచారు.
11:13 AM (IST) Feb 01
బిహార్ లో మకానా బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
11:11 AM (IST) Feb 01
పేదరికాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సున్నాశాతం పేదరికాన్ని తాము కోరుకుంటున్నామని అన్నారు.
11:05 AM (IST) Feb 01
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్' అంటూ తెలుగు కవి గురజాల అప్పారావు కవితతో బడ్జెట్ 2025 ప్రసంగాన్ని ప్రారంభించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
11:03 AM (IST) Feb 01
బడ్జెట్ 2025 లైవ్ ఇక్కడ చూడండి
10:37 AM (IST) Feb 01
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ కు చేరుకున్న వీడియో
10:29 AM (IST) Feb 01
బడ్జెట్ 2025 ఆమోదంకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ పార్లమెంట్ లో భేటీ అయ్యింది. ఈ బడ్జెట్ 2025-26 కు కేబినెట్ ఆమోదం లభించింది.
10:17 AM (IST) Feb 01
కేంద్రమంత్రులు ఒక్కోక్కరుగా పార్లమెంట్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్ కు చేరుకోగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మరోమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా చేరుకున్నారు.
10:10 AM (IST) Feb 01
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ 2025 కు ఆమోదం పొందిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది... బడ్జెట్ 2025 కి మోదీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత 11 గంటలకు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.
10:05 AM (IST) Feb 01
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ బిజిలీ యోజన పథకానికి ఈ బడ్జెట్ 2025 కేటాయింపులు పెంచే అవకాశం వుంది. అలాగే ఆదాయపన్ను శ్లాబుల్లో కూడా మార్పులు వుండవచ్చు.
09:55 AM (IST) Feb 01
దేశ బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.ఈ సందర్భంగా పూరీ సముద్రతీరంలో కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.
09:46 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ 2025 కు ఆమోదం పొందారు.ఆర్థిక శాఖ అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు నిర్మలా సీతారామన్. బడ్జెట్ 2025 గురించి రాష్ట్రపతికి వివరించి ఆమె ఆమోదాన్ని పొందారు.
09:37 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జట్ ప్రవేశపెట్టడానికి సిద్దమయ్యారు. ఆమె ఇప్పటికే ఇంటినుండి ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ 2025 కు ఆమోదం పొందుతారు.
09:24 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. ఉదయమే ఆర్థిక మంత్రి తన నివాసం నుండి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం 9 గంటలకు ఆమె తన బడ్జెట్ బృందంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెలుపల ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఆమె బడ్జెట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందడానికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో జరిగే కేబినెట్ బేటీలో పాల్గొని బడ్జెట్ 2025 ఆమోదం పొందుతారు.
09:16 AM (IST) Feb 01
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ 2025-26 షేర్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ బడ్జెట్ లో వృద్ధి, వినియోగం, మధ్యతరగతి వారికి పన్ను ఉపశమనం వంటి అంశాలపై ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీనివల్ల చాలా షేర్లలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి...