నార్టన్ 650 సిసి ఇంజన్‌తో సైక్లోన్ ఆర్‌ఎక్స్ 6 అడ్వెంచర్ బైక్‌..

By Sandra Ashok Kumar  |  First Published Sep 24, 2020, 11:30 AM IST

 సైక్లోన్ ఆర్‌ఎక్స్ 6 అనేది నార్టన్ 650 సిసి ట్విన్ ఇంజన్‌ తో మేడ్-ఇన్-చైనా బైక్. నార్టన్ 650 సిసి ట్విన్ ఇంజన్‌ ఉపయోగించడానికి లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసిన రెండు సంవత్సరాల తరువాత, గత డిసెంబరులో జోంగ్షెన్ ఆర్‌ఎక్స్ 6  బైక్ నమూనా వెల్లడైంది. 


చైనా మోటార్‌సైకిల్ బ్రాండ్ జోంగ్‌షెన్  సైక్లోన్ ఆర్‌ఎక్స్ 6 అడ్వెంచర్ బైక్‌ను చాంగ్‌కింగ్‌లో జరిగిన చైనా ఇంటర్నేషనల్ మోటార్‌సైకిల్ ట్రేడ్ ఎగ్జిబిషన్ (సి‌ఐ‌ఎం‌ఏ) షోలో ఆవిష్కరించింది. సైక్లోన్ ఆర్‌ఎక్స్ 6 అనేది నార్టన్ 650 సిసి ట్విన్ ఇంజన్‌ తో మేడ్-ఇన్-చైనా బైక్.

నార్టన్ 650 సిసి ట్విన్ ఇంజన్‌ ఉపయోగించడానికి లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేసిన రెండు సంవత్సరాల తరువాత, గత డిసెంబరులో జోంగ్షెన్ ఆర్‌ఎక్స్ 6  బైక్ నమూనా వెల్లడైంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

undefined

జోంగ్షెన్ ఆర్‌ఎక్స్ 6 తాజా వెర్షన్ 'ఏ‌డి‌వి' డిజైన్ అనుగుణంగా వైర్-స్పోక్ వీల్స్ ఉన్నాయి. జోంగ్షెన్ సైక్లోన్ ఆర్‌ఎక్స్ 6 బైక్ కొన్ని స్పెసిఫికేషన్లను మాత్రమే వెల్లడించింది, 650 సిసి ట్విన్ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 70 బిహెచ్‌పి, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 62 ఎన్ఎమ్ పీక్ టార్క్ తయారు చేస్తుంది.

also read 

ఆర్‌ఎక్స్ 6 సీటు ఎత్తు 820 ఎం‌ఎం, బరువు 215 కిలోలు. దీనికి నిస్సిన్ కాలిపర్లు బ్రేకింగ్‌ను అందించారు, దీని టాప్ స్పీడ్ 180 కిలోమీటర్. జోంగ్‌షెన్ అనేది చాంగ్‌కింగ్‌లో ఉన్న ఒక చైనీస్ ఆటోమోటివ్ బ్రాండ్ ఇది బైక్స్, క్వాడ్ బైక్‌లు, జనరేటర్లు, ఇంజన్‌లను తయారు చేస్తుంది.

ఈ సంవత్సరం చాంగ్‌కింగ్‌లో జరిగిన సి‌ఐ‌ఎం‌ఏ షోలో జోంగ్‌షెన్ 401 సిసి చిన్న స్పోర్ట్ టూరింగ్ మోడల్ బైక్ ఆర్‌జి300 ను ప్రదర్శించింది, ఈ బైక్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 42 బిహెచ్‌పి, 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 34 ఎన్ఎమ్ పీక్ టార్క్ను అందిస్తుంది.

ఆర్‌జి300 కూడా 215 కిలోల బరువు ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 150 కి.మీ. ఆర్‌ఎక్స్ 6,  ఆర్‌జి300 రెండూ చైనాలో జోంగ్షెన్ 'సైక్లోన్' బ్రాండ్ పేరుతో అమ్మబడతాయి.

click me!