11 కొత్త కలర్ ఆప్షన్లలో యమహా ఎం‌టి-15 బైక్.. ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Nov 23, 2020, 2:13 PM IST

ఎమ్‌టి -15 లో ఐస్ ఫ్లూ-వెర్మిలియన్ రంగు కోసం అధిక స్పందన నేపథ్యంలో ఈ కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ 20 నుండి "కస్టమైజ్ యువర్ వారియర్" అనే ప్రచారం భారతదేశంలో ప్రారంభించింది. 


ద్విచక్ర వాహన తయారీ సంస్థ  యమహా మోటార్ ఇండియా స్ట్రీట్ ఫైటర్ ఎం‌టి-15 బైక్ కోసం “కలర్ కస్టమైజేషన్ ఆప్షన్స్” ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్‌టి -15 లో ఐస్ ఫ్లూ-వెర్మిలియన్ రంగు కోసం అధిక స్పందన నేపథ్యంలో ఈ కొత్త ప్రచారాన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

నవంబర్ 20 నుండి "కస్టమైజ్ యువర్ వారియర్" అనే ప్రచారం భారతదేశంలో ప్రారంభించింది. కొత్త కస్టమైజేషన్ ఆప్షన్ ప్రారంభించిన తేదీ నుండి కొన్ని కొనుగోళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని పై ఆసక్తి ఉన్నవారు 11 ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు.

Latest Videos

undefined

సంస్థ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లో మీరు మీ బైక్‌ను కస్టమైజ్ చేసిన తర్వాత, ఆర్డర్ ఆధారంగా యమహా తయారు చేస్తుంది. కస్టమైజ్ యమహా ఎమ్‌టి -15 డెలివరీలు జనవరి 2021 నుండి ప్రారంభమవుతాయి, పసుపు రంగు చక్రాల మోడల్ మార్చి 2021 నుండి ప్రారంభమవుతుంది.

 యమహా ఎం‌టి-15 ఇప్పుడు మొత్తం 14 ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కొత్త సెల్ఫ్ కస్టమైజ్ యమహా ఎంటీ -15 ధరను రూ .1,43,900 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు.

మీరు స్వంతంగా బైక్‌ను కస్టమైజ్ చేయాలనుకుంటే మీరు ఐస్ ఫ్లూ-వెర్మిలియన్ కలర్ ధర కంటే రూ.3,000, స్టాండర్డ్ మాట్టే బ్లూ, మెటాలిక్ బ్లాక్ కలర్ ధర కంటే రూ .4,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 

also read 

ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల ఛైర్మన్ మోటోఫుమి షితారా మాట్లాడుతూ, నేటి కస్టమర్లు వారి స్టైల్ స్టేట్‌మెంట్‌కు తగిన వైవిధ్యమైన, విభిన్నమైన కలర్ కాంబినేషన్ కోసం చూస్తున్నారని, అందువల్ల యమహా తన వినియోగదారులకు కొత్త బైకింగ్ అనుభవాలను పరిచయం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుందని & కస్టమర్ అంచనాలను మించిన ఉత్పత్తులు & సేవలతో వారికి ఉత్సాహాన్ని అందింస్తుంది.

కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ చర్య తీసుకున్నామని, భవిష్యత్తులో, యమహా బ్రాండ్ దిశ “ది కాల్ ఆఫ్ ది బ్లూ” కి అనుగుణంగా ఉన్న ఎంపికలతో కంపెనీ ముందుకు రాబోతోందని ఆయన పేర్కొన్నారు.

యమహా ఎం‌టి-15 బైక్ 155 సి‌సి లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4-వాల్వ్, 6-స్పీడ్ ట్రాన్స్మిషన్, 155 సిసి ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్, డెల్టా బాక్స్ ఫ్రేమ్‌లో వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (వివిఎ) సిస్టం ఉంటుంది.

యమహా ఎం‌టి-15 బైక్ స్పీడ్, దృఢత్వం ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. A & S క్లచ్ మరియు సింగిల్ ఛానల్ ఏ‌బి‌ఎస్ తో పాటు ఉన్నతమైన నియంత్రణతో మరింత ప్రత్యేకతను ఇస్తుంది.

click me!