యమహా ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ కొత్త విటేజ్ ఎడిషన్.. బ్లూటూత్ కనెక్టివిటీతో ప్రత్యేకమైన ఫీచర్స్..

By Sandra Ashok Kumar  |  First Published Dec 2, 2020, 11:34 AM IST

 ఈ వింటేజ్ ఎడిషన్‌లో కొత్త స్టైల్స్‌తో పాటు బైక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టామని కంపెనీ తెలిపింది. భారతదేశంలో పదేళ్ల క్రితం నుండి యమహా బైక్స్ పనితీరు ‘థ్రిల్ ఆఫ్ రైడింగ్’ కేంద్రంగా స్థిరపడింది. స్టైలిష్ లుక్స్ & కంఫర్ట్‌తో ‘లార్డ్ ఆఫ్ స్ట్రీట్’ గా పేరుగాంచిన 150-సిసి కేటగిరీలోని యమహా ఎఫ్‌జెడ్ దేశంలో కొత్త బైకును అభివృద్ధి చేసింది.


ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా పాపులర్ మోడల్ బైక్ ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ వింటేజ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ వింటేజ్ ఎడిషన్‌లో కొత్త స్టైల్స్‌తో పాటు బైక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టామని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో పదేళ్ల క్రితం నుండి యమహా బైక్స్ పనితీరు ‘థ్రిల్ ఆఫ్ రైడింగ్’ కేంద్రంగా స్థిరపడింది. స్టైలిష్ లుక్స్ & కంఫర్ట్‌తో ‘లార్డ్ ఆఫ్ స్ట్రీట్’ గా పేరుగాంచిన 150-సిసి కేటగిరీలోని యమహా ఎఫ్‌జెడ్ దేశంలో కొత్త బైకును అభివృద్ధి చేసింది.

Latest Videos

undefined

ఎఫ్‌జెడ్ బ్రాండ్  బలమైన వారసత్వాన్ని అద్భుతమైన ఫ్రేమ్‌లో ఉంచడానికి యమహా నేడు ఇండియాలో ఎఫ్‌జెడ్ బ్రాండ్ ఔత్సాహికుల కోసం “వింటేజ్ ఎడిషన్”ను ప్రవేశపెట్టింది. స్టైల్ & టెక్నాలజీ, ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ వింటేజ్ ఎడిషన్ భారతదేశంలో యమహా ఐకానిక్ స్టైల్ ని పెంచనుంది. భారతదేశంలో ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ వింటేజ్ ఎడిషన్ ఎఫ్‌జెడ్‌ బ్రాండ్  స్టైల్ & డి‌ఎన్‌ఏను పొందుతుంది. 

also read 

విటేజ్ ఎడిషన్‌లో లెవెల్ సీట్లకు పాతకాలపు గ్రాఫిక్స్, ఐకానిక్ లెగసీని పెంచుతుంది, కొత్త లెదర్ ఫినిషింగ్ సింగిల్ పీస్ టూ లెవల్ సీట్ దాని స్టైల్-అప్ పురాతనత్వానికి మరింత తోడ్పడుతుంది. ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ కొత్త వింటేజ్ ఎడిషన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ “యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఎక్స్” అప్లికేషన్ వంటి సరికొత్త  ఫీచర్లు పరిచయం చేసింది.

ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ ఏ‌బి‌ఎస్ వింటేజ్ ఎడిషన్ ధర రూ. 1,09,700 / - (ఎక్స్ షోరూమ్, ఢీల్లీ). కొత్త వేరియంట్ డిసెంబర్ 1వ వారం నుండి అన్ని అధీకృత యమహా డీలర్‌షిప్‌లలో లభిస్తుంది.

ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మోటోఫుమి శితారా మాట్లాడుతూ “భారతదేశంలోని వినియోగదారులకు మెరుగైన మోటార్ సైక్లింగ్ అనుభవాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

నేడు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లతో మా ఎఫ్‌జెడ్‌ఎస్-ఎఫ్‌ఐ వేరియంట్లో వింటేజ్ ఎడిషన్‌ను పరిచయం చేసాము. భవిష్యత్తులో బైకింగ్ ఔత్సాహికులకు ఇలాంటి ఉత్సాహాన్ని తీసుకురావడం కొనసాగిస్తాము, అలాగే మేము మా బైక్స్ లైనప్ మొత్తం మెరుగుపరుస్తున్నామని. ” అని అన్నారు.

click me!