మీకు టి‌వి‌ఎస్ బైక్ ఉందా.. అయితే మీకో గుడ్ న్యూస్..

By Sandra Ashok Kumar  |  First Published Aug 5, 2020, 10:54 AM IST

టీవీఎస్‌ మోటార్స్‌ తమ కస్టమర్లకోసం ‘ఎక్స్‌పర్ట్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు ఇంటి నుండి ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.


హైదరాబాద్‌:  ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్‌ మోటర్స్ కంపెనీ వినియోగదారులకు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీవీఎస్‌ మోటార్స్‌ తమ కస్టమర్లకోసం ‘ఎక్స్‌పర్ట్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు ఇంటి నుండి ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు నిత్యవసరాల మినహా మిగతా పనులన్నీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Latest Videos

undefined

ఇలాంటి సమయంలో టి‌వి‌ఎస్ వాహన వినియోగదారులను దృష్టి పెట్టుకొని వారి ఇళ్ల వద్దే పిరియాడిక్‌ మెయింటెనెన్స్‌ సేవలు  అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కంపెనీ  ఓ ప్రకటనలో తెలిపింది.

also read 

 దేశ వ్యాప్తంగా ఉన్న 300 డీలర్‌షిప్‌ల పరిధిలో ఈ సేవలు అందుబాటులో తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం టోల్‌–ఫ్రీ నెంబర్, కస్టమర్‌ కేర్‌ ఈమెయిల్‌ ఐడీ, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ మార్గాల ద్వారా ఏ విధమైన వాహన సమస్యనైనా కస్టమర్ల ఇంటివద్దే పరిష్కరించుకునే వీలుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఈ ప్రకటనతో టీవీఎస్‌ వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పలు కంపెనీలు వాహనదారులకు మరింత చేరువ కావడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. అంతేకాదు ఇతర వాహన తయారీదారులు కొత్త వాహనల కొనుగోలుపై మూడు నెలల పాటు జీరో ఈ‌ఎం‌ఐ సౌకర్యం కూడా కలిపిస్తున్నాయి.

click me!