భారత్‌లోకి ట్రయంఫ్‌ ‘800 ఎక్స్‌సీఏ’...ధర రూ.15.17 లక్షలు

By Siva KodatiFirst Published Mar 12, 2019, 10:17 AM IST
Highlights

బ్రిటన్ ఆటోమొబైల్ మేజర్ ట్రయంఫ్.. భారత మార్కెట్లోకి తాజాగా ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్ సీఏ మోడల్ బైక్ ప్రవేశించింది. దీని ధర రూ.15.17 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. 

బ్రిటన్‌ ప్రీమియం మోటర్‌సైకిళ్ల సంస్థ ‘ట్రయంఫ్‌’ టైగర్‌ 800 ఎక్స్‌సీఏలో కొత్త వెర్షన్‌ను సోమవారం భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.15.17 లక్షలుగా నిర్ణయించింది. టైగర్‌ 800 ఎక్స్‌సీఏ కొత్త వెర్షన్‌లో 200కు పైగా చాసిస్‌, ఇంజిన్‌ మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. 

మరింత మెరుగైన ఫీచర్లతో మరింత మెరుగైన ఫీచర్లతో కొత్త వెర్షన్‌ బైక్‌ను అందుబాటులోకి తెచ్చామని ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌ ఇండియా తెలిపింది. ఈ మార్పులతో ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్‌సీఏపై ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంది. 

800 సీసీ ఇంజిన్‌ అమర్చిన కొత్త బైకు గరిష్ఠంగా 95పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఈ బైక్‌లో ఆరు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఆప్టిమైజ్డ్‌ సస్పెన్షన్‌ వంటి ఫీచర్లు దీని సొంతం. న్యూ టైగర్ 600 ఎక్స్ సీఏ మోడల్ బైక్‌లో ఆరు అదనపు ప్రోగ్రామబుల్ రైడర్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి.

800 ఎక్స్‌సీఏ మోడల్ బైక్‌లో పిల్లాన్ సీట్స్, హీటెడ్ రైడర్, టెయిల్ లైట్, స్టాండర్డ్ ఎల్ఈడీ ఆక్సిలరీ, ఇండికేటర్లు, సీఎన్సీ మెషిన్డ్ ఫుట్ పెగ్స్ తదితర ఫీచర్లు అదనంగా చేర్చారు. ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారత్‌లో టైగర్‌ బ్రాండ్‌ బైకులు చాలా కీలకమైనవి.

ఇప్పటికే 1000కి పైగా టైగర్‌ బైకులు రోడ్లపై తిరుగుతున్నాయి. భారత్‌లో ట్రయంఫ్‌ టైగర్‌ అతిపెద్ద ప్రీమియం అడ్వెంచర్‌ మోటార్‌సైకిల్‌ అనడంలో సందేహం లేదు’ అని వెల్లడించారు.

ఈ బైక్‌లో పూర్తి స్థాయి ఎల్‌ఈడీ లైట్లు, జాయ్‌స్టిక్‌ కంట్రోల్, అల్యూమినియమ్‌ ఫినిష్డ్‌ స్టాండర్డ్ రేడియేటర్‌ గార్డ్, టీఎఫ్‌టీ స్క్రీన్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ తెలిపారు. 

టైగర్ బ్రాండ్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉన్నదని ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ చెప్పారు. ప్రస్తుతం మూడు వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందన్నారు. 

click me!