‘ట్రయల్’అంటూ వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘ట్విన్స్’:27న విపణిలోకి

By Siva KodatiFirst Published Mar 17, 2019, 1:59 PM IST
Highlights

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్.. భారతదేశంలో తన ప్రేమికుల కోసం సరికొత్త మోడల్ మోటారు సైకిల్ అందుబాటులోకి తెస్తున్నది. ‘ట్రయల్’పేరిట ట్విన్ బైక్స్‌ను తీసుకొస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ వాటిని పుణెలో ఈ నెల 27వ తేదీన భారత విపణిలో ఆవిష్కరించనున్నది.
 

ఫ్యాషనబుల్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అధునాతన మోడల్ ‘ట్రయల్’ ఈ నెల 27వ తేదీన భారత మార్కెట్లో అడుగు పెట్టనున్నది. స్క్రాంబ్లర్ తరహా డిజైన్‌తో తీర్చిదిద్దిన మోడల్ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రయల్. 

మహారాష్ట్ర రాష్ట్రం పుణెలోని అంబే వ్యాలీలో ఈ నెల రాయల్ ఫీల్డ్ సంస్థ ఈ మోడల్ జంట వాహనాలను ఆవిష్కరించనున్నది. 2019 రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రయల్స్ 350 సీసీ, 500 సీసీ మోడళ్లలో బైక్ రైడర్లకు కనువిందు చేయనున్నాయి. 

క్లాసిక్ సిరీస్ చేజిస్ ఆధారంగా ఈ బైక్ లు రూపుదిద్దుకున్నాయి. కానీ స్క్రాంబ్లర్ స్టైల్‌లో డిజైన్ చేశారు. రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రయల్ మోడల్ బైక్‌లు విదేశీ మార్కెట్లలో దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రా, థండర్ బిర్డ్ చేజిస్ ఆధారంగా రూపుదిద్దుకున్నాయి. 

డ్యూయల్ చానెల్ ఏబీఎస్ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రయల్స్ బైక్‌లు వాటర్ వేడింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. కొన్ని నెలల క్రితం మార్కెట్లో విడుదలైన స్పైడ్ మోడల్ మోటారు సైకిళ్లను పోలి ఉన్నాయి. క్లాసిక్ మోడల్ బైక్ లతో పోలిస్తే రూ.10 వేలు ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రయల్స్ మోడల్ పేరు అంత ఫ్యామిలియర్ కాకున్నా.. ఆ బైక్ ప్రేమికులకు మాత్రం బాగా నచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇంకా రాయల్ ఎన్ ఫీల్డ్ ట్రయల్ మోడల్ బైక్ ల ధర ఎంత అన్నది ఖరారు కాలేదు. 

 
 

click me!