జనవరి 2021 నుండి ద్విచక్ర వాహనాల ధరలు పెంపు.. ఏ బైక్ పై ఎంతంటే ?

By S Ashok Kumar  |  First Published Dec 17, 2020, 12:27 PM IST

వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా  ప్రయాణీకుల, వాణిజ్య వాహనాల్లో ధరల పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించండానికి ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ద్విచక్ర వాహన సంస్థ పేర్కొంది. 


ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 1 జనవరి 2021 నుంచి ఉత్పత్తి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా  ప్రయాణీకుల, వాణిజ్య వాహనాల్లో ధరల పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.

వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించండానికి ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ద్విచక్ర వాహన సంస్థ పేర్కొంది. కొత్త సంవత్సరానికి ధరల పెరుగుదలను ప్రకటించిన మొదటి ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో నిలిచింది.

Latest Videos

undefined

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హీరో మోటోకార్ప్ మాట్లాడుతూ "వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా పూడ్చడానికి మేము 1 జనవరి 2021 నుండి అమలులోకి వచ్చే విధంగా మా ఉత్పత్తుల ధరలను 1,500 రూపాయల వరకు పెంచుతున్నాము.

also read ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా హార్ట్ టచింగ్ వీడియో..నన్ను చాలా తొందరగా ఏడ్పించేసింది అంటూ పోస్ట్.. ...

ధరల పెరుగుదల మోడళ్లను బట్టి మారుతుంది, వీటి పూర్తి వివరాలను నిర్ణీత సమయంలో మా డీలర్లకు తెలియజేస్తాము " అని తెలిపింది.

"స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్స్, విలువైన లోహాలతో సహా స్పెక్ట్రం అంతటా వస్తువుల ఖర్చులు క్రమంగా పెరిగాయి. మేము ఇప్పటికే లీప్ -2 కింద మా పొదుపు కార్యక్రమాన్ని వేగవంతం చేసాము, చేస్తూనే ఉంటాము. కస్టమర్లపై భారాన్ని తగ్గించడం, మా మార్జిన్‌లను రక్షించడం అనే లక్ష్యంతో ఉంటాము " సంస్థ తెలిపింది.

త్రైమాసిక ఫలితాలకు సంబంధించి హీరో మోటోకార్ప్ స్వతంత్ర నికర లాభం రూ.953.45 కోట్లు, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే  874.80 కోట్ల రూపాయలతో 8.99 శాతం పెరుగుదల నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.9367.34 కోట్లుగా ఉంది, కిందటి ఏడాదితో పోల్చితే 7570.70 కోట్ల నుండి 23.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

హీరో మోటోకార్ప్ 2020 జూలై నుండి సెప్టెంబర్ మధ్య 18.22 లక్షల యూనిట్లను విక్రయించింది, ఎందుకంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తర్వాత డిమాండ్ కోలుకుంది. ద్విచక్ర వాహన తయారీదారు అమ్మకాలను మరింత పునరుద్ధరించడానికి అనేక ఆఫర్లు, స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కూడా విడుదల చేసింది. పండుగ కాలంలో 8 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
 

click me!