దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ సేల్స్‌లో ‘ఘన’మైన రికార్డే నమోదు చేసింది. ఒక్క మార్చి నెలలోనే పల్సర్ విక్రయాలు లక్ష దాటాయి. ఏటేటా పల్సర్ విక్రయాలు పెరుగుతున్నాయి.
ముంబై: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో.. పల్సర్ మోడల్ బైక్ సేల్స్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. మార్చిలో వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నా పల్సర్ మోడల్ బైక్‌లు మాత్రం మాత్రం లక్షకు పైగా అమ్ముడుపోయాయి. గతేడాది మార్చిలో దేశీయంగా 1,58,987 పల్సర్స్ అమ్ముడు పోగా, ఈ ఏడాది మార్చిలో అది 2,20,013 యూనిట్లు విక్రయించారు. ఇది 39 శాతం పురోగతిని నమోదు చేస్తుంది. గత నెలలో కమర్షియల్ వెహికల్స్ బిజినెస్‌తో పోలిస్తే సగటున 20 శాతం గ్రోత్ నమోదు చేసింది.
నెలలో లక్ష పల్సర్ల విక్రయాలు దాటడం తొలిసారి
తొలిసారి దేశీయ మార్కెట్‌లో సేల్స్‌లో బజాజ్ పల్సర్ ఈ మార్కును దాటింది. సాధారణంగా పల్సర్ సగటు విక్రయాలు 45 వేల నుంచి 60 వేల మధ్యలో ఉంటాయి. 2018 మార్చితో పోలిస్తే ఈ సారి 39శాతం విక్రయాలు అధికంగా జరిగాయి.
undefined
తొలిసారి విపణిలోకి 2001లో
బజాజ్ తొలిసారి పల్సర్ బ్రాండ్‌ను 2001లో మార్కెట్లోకి తెచ్చింది. 150 సీసీ - 220 సీసీ సెగ్మెంట్‌లో దీనిని విక్రయాలను చేపట్టింది. ఈ మధ్యలో పలు అప్‌గ్రేడ్ వెర్షన్లను తీసుకొచ్చింది. 108సీసీ, 220ఎఫ్, ది ఆర్‌ఎస్, ఎన్‌ఎస్200 మోడళ్లను ప్రవేశపెట్టింది.
యాంటీ లాక్ బ్రేకింగ్‌తో 2019 మోడల్ పల్సర్
2019లో కొన్ని మార్పులు చేసి సింగిల్ ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. పల్సర్ అమ్మకాల్లో ఏటేటా పెరుగుదల కనిపిస్తోంది. 2018-19లో దేశీయ విక్రయాలు, ఎగుమతులు కలిపి 25 శాతం పెరిగాయి. దీంతో అమ్మకాలు 50,19,503కు చేరినట్లైంది. 2017-18లో 40,06,791 యూనిట్లను విక్రయించింది.
విపణిలోకి డామినార్ 400
బజాజ్ ఆటో గురువారం దేశీయ మార్కెట్లోకి తన ప్రీమియం మోటార్ సైకిల్ బైక్ ‘డామినార్ - 400’ను దేశీయ విపణిలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.1.74 లక్షలుగా ఉంటుంది. నూతన డామినార్ లిక్విడ్ కూల్డ్ 373.3 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ కలిగి ఉంటుంది. గత మోడల్ డామినార్ బైక్‌లతో పోలిస్తే దీని సామర్థ్యం 35 పీఎస్ ఎక్కువ.
కంఫర్టబుల్ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ కోసం డామినార్
కంఫర్టబుల్ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ కోసం 43 ఎంఎం అప్ సైడ్ డౌన్ ఫోర్క్స్ అమర్చారు. సుదూర ప్రయాణం చేసే కస్టమర్ల కోసం, స్పోర్ట్స్ టూరర్ల కోసం న్యూ డామినార్ రూపొందించామని బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ విభాగం ప్రెసిడెంట్ సరాంగ్ కనడే తెలిపారు. డ్యూయల్ చానెల్ ఏబీఎస్ వేరియంట్‌తో న్యూ డామినార్ బైక్ అన్ని డీలర్ షిప్ ల వద్ద అందుబాటులో ఉంటుంది.
తొలి త్రైమాసికంలో బీఎండబ్ల్యూ రికార్డ్ సేల్స్
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ ఈ ఏడాది తొలి త్రైమాసికం సేల్స్‌లో రికార్డు నెలకొల్పింది. మార్చి నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో 2,982 కార్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 19 శాతం పెరుగుదల అని బీఎండబ్ల్యూ పేర్కొంది. మినీ బ్రాండ్ కార్లు 160 (18%), మోటారాడ్ 597 కార్లు విక్రయించినట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హాన్స్ చిరిస్టియన్ బైర్టెల్స్ తెలిపారు. 5 సిరీస్, 6 సిరీస్ గ్రాన్ టురిస్మో మోడల్ కార్ల సేల్స్ మొత్తం బీఎండబ్ల్యూ కార్ల విక్రయాల్లో కీలకం కానున్నాయి.