ఇన్ స్టాగ్రామ్ లో విపరీతంగా ఫేమస్ అయిన కచ్చా బాదం పాటకు స్పెప్పులు వేయగా..తాజాగా.. తమిళ పాట మయకిరియేకి చిందులు వేయడం గమనార్హం. అది కూడా రోడ్డుపై వేయడం గమనార్హం.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన ఆటతో దేశాన్ని గర్వించేలా చేయడంలో.. సింధు ఎప్పుడూ ముందుంటారు. కాగా.. ఈ బ్యాడ్మింటన్ స్టార్... కోర్టులో రాకెట్ పట్టి.. చెలరేగడం మీరు చూసే ఉంటారు. అయితే.. ఆమె డ్యాన్స్ చేయడం ఎప్పుడైనా చూశారా..? కొద్ది రోజుల క్రితం.. ఇన్ స్టాగ్రామ్ లో విపరీతంగా ఫేమస్ అయిన కచ్చా బాదం పాటకు స్పెప్పులు వేయగా..తాజాగా.. తమిళ పాట మయకిరియేకి చిందులు వేయడం గమనార్హం. అది కూడా రోడ్డుపై వేయడం గమనార్హం.
పీవీ సింధు డ్యాన్స్ తో వైరల్ అవడం తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం కచ్చా బదాం పాటకు పసుపు డ్రెస్ లో మూమెంట్ చేస్తూ డ్యాన్స్ వేసింది. ఇక రీసెంట్ గా అనిరుధ్ రవిచందర్ కంపోజింగ్ లో వచ్చిన అనివీ పాటకు డ్యాన్స్ వేసింది.
undefined
బ్లూ డెనిమ్స్, పింక్ జాకెట్, క్యాప్ పెట్టుకుని మయకరియే అంటూ చిందులేస్తూ.. ఇన్స్టాలో డ్యాన్స్ ఈజ్ ద జాయ్ ఆఫ్ మూమెంట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. సింధు చిందేస్తే అభిమానులు ఆగుతారా.. లక్షల్లో చూసేశారు. కచ్చాబదాం పాటను 9లక్షల మందికిపైగా లైక్ చేస్తే.. తమిళ పాటను రెండు లక్షల మంది లైక్ కొట్టారు.
ఇదిలా ఉండగా.. గతేడాది దేశంలో అత్యున్నత మూడో పురస్కారమైన పద్మ భూషణ్ అందుకున్నారు పీవీ సింధు. 2015లో ఇండియాలో నాలుగో అత్యున్నత పురస్కారమైన పద్మ శ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు. 2016లో ఖేల్ రత్నాను కూడా దక్కించుకున్నారు సింధు.