సిల్వర్ సింధు అనేశారు.. స్వర్ణం గెలిచి తీరుతా

By telugu news team  |  First Published Apr 25, 2020, 2:07 PM IST

 మహిళా క్రికెటర్లు స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ ‘డబుల్‌ ట్రబుల్‌’ పేరిట ఓ కొత్త వెబ్‌ షో ప్రారంభించారు

people started calling me silver sindhu, pv sindhu on over coming losses in finals

భారత బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) నిర్వహిస్తున్న 'ఐయామ్‌ బ్యాడ్మింటన్‌'క్యాంపైన్‌కు ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రచారకర్తగా ఎంపికైంది. 

ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్‌  ప్రకటించింది. సింధుతో పాటు మరో ఏడుగురు అంతర్జాతీయ షట్లర్లు ఈ క్యాంపైన్‌ను నిర్వహించనున్నారు. క్రీడాకారులు ఆటను గౌరవించడం, ప్రేమించడం, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిజాయితీగా ఆడడం వంటి అంశాలపై ఈ ప్రచారకర్తలు అవగాహన కల్పించనున్నారు.

Latest Videos

ఇదిలా ఉండగా.. గత ఏడాది జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపింది. మహిళా క్రికెటర్లు స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ ‘డబుల్‌ ట్రబుల్‌’ పేరిట ఓ కొత్త వెబ్‌ షో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలి అతిథిగా ప్రపంచ చాంపియన్‌ సింధు పాల్గొంది. ఈ సందర్భంగా సింధు తన మనసులోని భావాలను దాపరికం లేకుండా పంచుకొంది. 

‘2019 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. అప్పటికే ఈ టోర్నీలో నేను రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలుపొందా. ఇక, ఫైనల్‌ చేరడం రెండోసారి. ఈసారి ఫైనల్లో కచ్చితంగా విజయం సాధించాలని అనుకున్నా’ అని సింధు వెల్లడించింది. ఒకవేళ ఓడిపోతే తాను ఏమిచేసే దానినో కూడా తెలియదని పేర్కొంది. ‘ఇకపై ప్రజలు నన్ను ‘సిల్వర్‌ సింధు’ అని పిలవకూడదు. అందుకే ఫైనల్‌ ముందు బాగా ఆడాలి..బాగా ఆడాలి..ఎలాగైనా సరే విజయం సాధించాలని అనుకున్నా’ అని తెలిపింది. 

తుది సమరంలో ఒకుహరాను చిత్తు చేసిన సింధు..వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం అందుకున్న తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image