వరల్డ్ టూర్ ఫైనల్స్.... ముగిసిన పీవీ సింధు కథ

ramya Sridhar   | Asianet News
Published : Dec 13, 2019, 11:26 AM IST
వరల్డ్ టూర్ ఫైనల్స్.... ముగిసిన పీవీ సింధు కథ

సారాంశం

తొలి మ్యాచ్ లో యమగూచితో ఏలా ఓడిపోయిందో... ఈ మ్యచ్ లో కూడా అదేవిధంగా సింధు చేజార్చుకోవడం గమనార్హం. గంటా 12 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. కాగా.. ఫస్ట్ మ్యాచ్ సింధు గెలిచింది. తర్వాత రెండో గేమ్ లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యింది

వరల్డ్ టూర్ ఫైనల్స్ లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కథ ముగిసింది. వరసగా రెండో మ్యాచ్ లోనూ సింధు ఓటమి పాలయ్యింది.  చైనాలో ఈ సిరీస్ జరుగుతుండగా... గురువారం గ్రూప్ ఏ లో జరిగిన తన రెండో మ్యాచ్ లో సింధు 22-20, 16-21, 12-21తో చెన్ యుఫీ(చైనా) చేతిలో పరాజయం పాలైంది.

తొలి మ్యాచ్ లో యమగూచితో ఏలా ఓడిపోయిందో... ఈ మ్యచ్ లో కూడా అదేవిధంగా సింధు చేజార్చుకోవడం గమనార్హం. గంటా 12 నిమిషాల పాటు మ్యాచ్ సాగింది. కాగా.. ఫస్ట్ మ్యాచ్ సింధు గెలిచింది. తర్వాత రెండో గేమ్ లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యింది. 

తొలిగేమ్ లో ఒక దశలో సింధు 17-20 వెనకబడింది.. తర్వాత కోలుకొని 5 పాయింట్లతో గేమ్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే... రెండో మ్యాచ్, నిర్ణయాత్మక మూడో గేమ్ లో... సింధు తన సత్తా చాటలేకపోయింది. దీంతో... విజయం సింధు చేతుల్లో నుంచి చేజారిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఓదశలో సింధు 4-8తో వెనుకబడినా.. చక్కటి పోరాటం కనబరిచి 10-10తో స్కోరును సమం చేసి పోటీలోకొచ్చింది.
 
ఈ దశలో వైడ్‌ షాట్లతో యుఫీ విజృంభించడంతో భారత షట్లర్‌ ఇబ్బంది పడింది. 12-12తో ఇరువురూ సమంగా ఉన్న దశలో యుఫీ వరుసగా 9 పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సైతం సొంతం చేసుకుంది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడడంతో టోర్నీలో సింధు నాకౌట్‌ అవకాశాలు గల్లంతయ్యాయి. యుఫీ, యమగూచి సెమీస్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. దీంతో శుక్రవారం హి బింగ్జియావోతో సింధు మ్యాచ్‌ నామమాత్రమే.

PREV
click me!

Recommended Stories

అమ్మతనానికి ఆదర్శం.. 30 లీటర్ల చనుబాలు దానం చేసిన గుత్తా జ్వాల
Saina Kashyap: కశ్యప్ తో విడాకులు.. ట్విస్ట్‌ ఇచ్చిన సైనా నెహ్వాల్‌