ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

Published : Sep 23, 2018, 02:17 PM ISTUpdated : Sep 23, 2018, 02:27 PM IST
ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

సారాంశం

అరకు సమీపంలోనే క్వారీ విషయంలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో సుమారు  గంటకు పైగా  చర్చించారని సమాచారం.

విశాఖపట్టణం: అరకు సమీపంలోనే క్వారీ విషయంలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతో సుమారు  గంటకు పైగా  చర్చించారని సమాచారం.సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేతో కూడ చర్చించిన తర్వాత ఈ ఘటనకు పాల్పడినట్టు సమాచారం.  అయితే  సామరస్యపూర్వకంగా చర్చిద్దామని  సర్వేశ్వరరావు సూచించినా.... మావోలు దాడికి దిగారని తెలుస్తోంది.

 

"మావోయిస్టుల దాడిలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ అక్కడిక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం 11 గంటల వరకు కూడ అరకులోనే ఎమ్మెల్యే సర్వేశ్వరావు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ ఉన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమంలోనే భాగంగానే డుబ్రీగంట తొట్టంగి రహదారిపై మావోలు ఎమ్మెల్యేతో పాటము మాజీ ఎమ్మెల్యే సోమపై కాల్పులు జరిపారు.

లిప్పిటిపుట్టు గ్రామ సమీపంలోకి  ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చేరుకోగానే  మావోయిస్టులు సర్వేశ్వరరావును చుట్టుముట్టారు. సర్వేశ్వరరావు గన్‌మెన్ల వద్ద ఉన్న ఆయుధాలను  తీసుకొన్నారు. 

గూడ క్వారీ విషయమై మావోయిస్టులు సర్వేశ్వరరావుతో చర్చించారు. ఈ క్వారీ కూడ ఎమ్మెల్యేసర్వేశ్వరరావుది. ఈ క్వారీ కారణంగా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

సర్వేశ్వరరావు ఈ క్వారీని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే  ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో సర్వేశ్వరరావు కూడ సామరస్యపూర్వకంగానే చర్చల ద్వారా పరిష్కరించుకొందామని ఎమ్మెల్యే సర్వేశ్వరావు సూచించారు.

అయితే క్వారీ విషయమై ఎమ్మెల్యే చేసిన సూచనను మావోలు పట్టించుకోలేదని సమాచారం. ఈ మేరకు మావోలు మూడు రౌండ్లు సర్వేశ్వరరావుపై జరిపారు. ఈ ఘటనలో సర్వేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.

మరోవైపు మాజీ ఎమ్మెల్యే సివిర సోమ .. ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సోమ కారణమని భావించారు. ఈ విషయమై సోమను నిలదీశారు. ఈ విషయమై సోమ ఇచ్చిన వివరణను మావోలు పట్టించుకోలేదని సమాచారం. సోమపై కూడ  మావోలు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.

సంబంధిత వార్తలు

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి
 

PREV
click me!