త్వరలో భారత విపణిలోకి యెజ్డీ ‘రీఎంట్రీ’!!

By rajesh yFirst Published Aug 17, 2019, 1:01 PM IST
Highlights

కొన్నేళ్లపాటు భారతదేశ విపణికి దూరంగా ఉన్న యెజ్డీ మోటారు సైకిళ్లు తిరిగి ఎంటరయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. 

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా భారత విపణికి దూరంగా ఉన్న జావా మోటార్ సైకిల్స్ ఇటీవలే రంగ ప్రవేశం చేసింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా సొంతంగా ఏర్పాటుచేసిన బ్రాండ్ క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో తిరిగి యెజ్డీ మోటార్ సైకిల్స్ కూడా ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటరవుతోంది. 

యెజ్డీ మోటార్ సైకిల్స్‌ను భారత విపణిలో అడుగు పెట్టనున్న సంగతిని క్లాసిక్ లెజెండ్స్ సహ వ్యవస్థాపకులు అనుపమ్ థారెజా ప్రకటించారు. బీఎస్ఎ బ్రాండ్ సంస్థ భారత విపణిలోకి విడుదల చేయనున్నది.

ఇన్‌స్టాగ్రామ్ న్యూ హ్యాండిల్‌లో ‘యెజ్డీ’ మోటారు సైకిల్ పేరు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు యెజ్డీ వెబ్ సైట్ జావా మర్చండైజ్‌ను కస్టమర్లకు పరిచయం చేశారు. ఎప్పుడు విపణిలోకి యెజ్డీ మోటారు సైకిళ్లు ప్రవేశిస్తాయన్న సంగతి వెల్లడించకున్నా వచ్చే ఏడాది జరిగే ఆటో ఎక్స్ పోలో నూతన వాహనాలను ప్రదర్శించనున్నది. 

ఇంతకుముందు రోడ్ కింగ్, ఆయిల్ కింగ్, క్లాసిక్, సీఎల్-2, మొనార్చ్, డీలక్స్, 350, 175 మోడల్ బైక్స్ ప్రజాదరణ పొందాయి. బీఎస్ఏ బ్రాండ్‌పై యెజ్డీ మోటారు సైకిళ్ల విడుదల సంగతెలా ఉన్నా.. దీని విషయమై మహీంద్రా అండ్ మహీంద్రా పలు విషయాలు వెల్లడిస్తోంది. జావా మోటార్ సైకిల్ ఇంజిన్ మాదిరే మహీంద్రా మోజో పవర్స్ యెజ్డీ బైక్‍ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 

ఇప్పటికే భారతదేశంలో జావా బైక్స్ చాలా ప్రజాదరణ పొందాయి. జావా బైక్స్‌లో రెండు రకాల ఇంజిన్ మోడళ్లు ఉన్నాయి. 283 సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 27 బీహెచ్పీ, 28 ఎన్ టార్చ్ ఆవిష్కరించింది. మరో మోడల్ బైక్ 334 సీసీ సామర్థ్యంతో 30 బీహెచ్పీ, 31 ఎన్ఎం టార్చ్ శక్తిని అందజేస్తోంది. 

click me!