రికార్డు స్థాయికి చేరిన వోక్స్‌ వ్యాగన్‌ సేల్స్

By sivanagaprasad kodati  |  First Published Jan 12, 2019, 10:13 AM IST

జర్మనీ ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ కార్లు 2018లో 6.24 మిలియన్ల యూనిట్లు విక్రయించింది. హైబ్రీడ్, విద్యుత్ మోడల్ కార్లు 2018లో 50 వేలు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. 


ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. 2018లో వీడబ్ల్యూ బ్రాండ్‌ కింద 6.24 మిలియన్ కార్లు అమ్ముడయ్యాయి. అమెరికా ఫస్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. చైనాతో వాణిజ్య యుద్ధం సాగుతున్నా.. చైనాలో వోక్స్ వ్యాగన్ మోడల్ వీడబ్ల్యూ బ్రాండ్ విక్రయాలు 2018లో భారీగా జరిగాయి.

కొత్త కాలుష్య నియంత్రణ నిబంధనల కారణంగా ఇబ్బందులు తలెత్తినా అమ్మకాల మీద ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. 2015లో ఉద్గారాల పరీక్షల ఛీటింగ్ కుంభకోణం నుంచి కంపెనీ ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. యూరోపియన్‌ పర్యావరణ నిబంధనలు కఠినతరం కావడం పెద్ద సమస్యగా ఉంది. 

Latest Videos

ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాలను పెంచుకోవడంపై ప్రయత్నాలు వోక్స్ వ్యాగన్ మొదలు పెట్టింది. ఖర్చులను నియంత్రించుకొని ఆ నిధులను ఎలక్ట్రిక్‌ కార్లు, ఆటోమెటిక్‌ డ్రైవింగ్ ప్రాజెక్టుపై పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ఏడాది వోక్స్ వ్యాగన్ సంస్థకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. 

చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ‘అమెరికా ఫస్ట్’ విధానాంపై మొగ్గు చూపడం అంతర్జాతీయ ఆటో పరిశ్రమ మీద ప్రభావం చూపనుంది. ‘2019లో మాకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. వాటి మధ్యలో మేము అమ్మకాలు పెంచుకోవడంతో పాటు లాభదాయకతపై ఎక్కువ దృష్టి సారించనున్నాం’ అని ఆ కంపెనీ సీఓఓ రాల్ఫ్ బ్రాండ్‌స్టేటర్‌ వెల్లడించారు.

ఈ అమ్మకాల్లో ఫోక్స్‌ వ్యాగన్ బ్రాండ్లయిన ఆడి, పోర్షె, స్కోడా, బెంట్లే, బుగాట్టి, లంబొర్గినిని పరిగణలోకి తీసుకోలేదు. 2018లో చైనాలో వీడబ్ల్యూ బ్రాండ్ అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఆసియా -పసిఫిక్ ప్రాంతంలో సేల్స్ 1.7 శాతం తగ్గుముఖం పట్టాయి. గత సెప్టెంబర్ నెలలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టినా యూరోపియన్ యూనియన్ దేశాల పరిధిలో 3.6 శాతం సేల్స్ పెరిగాయి. 

కొన్ని ప్రాంతాల్లో విక్రయాల్లో ప్రత్యేకించి 2018 ద్వితీయార్థంలో పలు సమస్యలు తలెత్తాయని వోక్స్ వ్యాగన్ బ్రాండ్ సేల్స్ చీఫ్ జైర్గెన్ స్టాక్ మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2017తో పోలిస్తే 2018లో 13 శాతం విద్యుత్, హైబ్రిడ్ కార్ల విక్రయాలు పెరిగాయి. 2018లో ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్లు 50 వేల వరకు విక్రయించారు.

click me!