బాలెనో’, ‘ఎలైట్ ఐ20’లతో ‘సై’ అంటే ‘సై’?: టాటా...‘ఆల్ట్రోజ్’

By Sandra Ashok KumarFirst Published Nov 28, 2019, 10:39 AM IST
Highlights

ఇంపాక్ట్ 2.0 డిజైన్‌తో రూపుదిద్దుకున్న టాటా ఆల్ట్రోజ్ విపణిలో అడుగు పెడితే మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఎలైట్ ఐ 20 మోడల్ కార్లతో ఢీకొడుతుందని అంచనా వేస్తోంది టాటా మోటార్స్.

టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు తొలి వాహనాన్ని బుధవారం ఆవిష్కరించింది. పుణె ప్లాంట్‌లో దీన్ని తయారు చేశారు. వచ్చే ఏడాది జనవరిలో విపణిలోకి రానున్నది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ కింద రూపుదిద్దుకున్న రెండో వెహికల్ ఇది. 

also read  హోండా సిటీ న్యూ మోడల్ ...లాంచ్ ఎప్పుడంటే ?

అలాగే కొత్త ఆల్ఫా ఆర్కిటెక్చర్‌పై అభివ్రుద్ధి చెందిన తొలి వాహనం కూడా ఇదే. ’ఆల్-న్యూ-ఆల్ఫా’ ప్లాట్ ఫామ్‌పై రూపుదిద్దుకున్న తొలి వాహనం ఆల్ట్రోజ్. ’స్మార్ట్ ఫీచర్లతో రూపొందించిన ఈ కొత్త కారు మా వినియోగదారులకు తప్పకుండా నచ్చుతుంది’ అని టాటా ప్రయాణికుల వాహన వ్యాపార విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీఖ్ చెప్పారు. 

ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ కారును ఆవిష్కరించడం ద్వారా టాటా మోటార్స్. హైలీ కాంపిటీటివ్ సెగ్మెంట్‌లో తన షేర్ పెంచుకునేందుకు సిద్ధమైంది. గతేడాదే టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. హ్యాచ్ బ్యాక్ విభాగంలో భారీ అంచనాలు ఉన్నాయని మయాంక్ పరీఖ్ తెలిపారు. ఈ కారులో ఇంతకుముందు రాని పలు స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయన్నారు.'

also read  బీఎస్-6 స్టాండర్డ్‌తో టీవీఎస్ అపాచీ బైక్స్ రెడీ.. బట్ ధరెంతంటే ?

తొలిసారి 2018 ఫిబ్రవరిలో ఆటో ఎక్స్ పోలో 45ఎక్స్ కాన్సెప్ట్‌తో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది. తర్వాత జెనీవాలో జరిగిన ‘జిమ్స్’లోనూ ప్రదర్శించింది. ఒకసారి మార్కెట్లోకి అడుగు పెడితే మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఎలైట్ ఐ20 మోడల్ కార్లతో ఢీ కొడుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. 

click me!