పండుగ సీజన్‌లో మార్కెట్‌లోకి ‘టీవీఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్’

By sivanagaprasad kodati  |  First Published Sep 26, 2018, 7:46 AM IST

ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్‌తో కలగలిసి రూపొందించిన న్యూ డ్యుయల్ టోన్ కలర్ వేరియంట్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్.. ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కూడా కలిగి ఉంది. మార్కెట్‌లో టీవీఎస్ స్టార్ సిటీ డ్యూయల్ ధర రూ.52,907. 


ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్స్’ పండుగల సీజన్‌లో పండుగల సీజనును నూతన మోడల్ ‘టీవీఎస్‌ స్టార్‌ సిటీ+’ను మార్కెట్ లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.52,907గా ఉంది.

110 సీసీ మోటార్‌ సైకిల్‌ సింక్రనైజ్డ్‌ బ్రేకింగ్‌ సాంకేతికత (ఎస్బీటీ) డ్యూయల్‌ టోన్‌ మిర్రర్లతో మార్కెట్‌లోకి వస్తోంది. ఎస్బీటీ అనేది ముందు, వెనక బ్రేకులను ఒకేసారి పడేలా చేస్తుంది. తద్వారా బ్రేకింగ్‌పై నియంత్రణ ఉండడంతో  బండి జారిపడకుండా కాపాడుతుంది. 110సీసీ విభాగంలో ఈ సాంకేతికతను అందిస్తున్న కంపెనీ తమదేనని టీవీఎస్‌ పేర్కొన్నది.

Latest Videos

న్యూ డ్యుయల్ టోన్ కలర్ వేరియంట్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌కు ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అదనం. 8.4 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎం టార్చ్ కలిగి ఉంటుంది. అంతే కాదు టీవీఎస్ క్రోమ్ 3 డీ లేబిల్, క్రౌన్ విజిటర్, బ్లాక్ గ్రాబ్ రైల్ కలిగి ఉంది. గ్రే బ్లాక్ కలర్ లో అందుబాటులో రానున్న టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డ్యూయల్ టోన్ ఎడిషన్ మోడల్ బైక్‌లు బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ, రెడ్ బ్లాక్ రంగుల్లో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయి.
 

click me!