2,458cc గల కొత్త బైక్ లాంచ్ చేయనున్న ట్రంఫ్ మోటార్ సైకిల్స్

By Sandra Ashok Kumar  |  First Published Nov 25, 2019, 3:58 PM IST

 ట్రంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో సంస్థ ఆరేళ్ల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త రాకెట్ 3 బైక్ ప్రదర్శించనున్నారు.2020  ట్రంఫ్ రాకెట్ 3,  రాబోయే ఇండియా బైక్ వీక్‌ 2019లో  దీనిని  ప్రదర్శించనున్నారు.


కొత్త  ట్రంఫ్ రాకెట్ 3 మునపటి సంవత్సరం ప్రారంభంలో దీనిని ప్రారంభించినప్పటి నుండి  బైక్ లవర్స్ కి కొత్త అంచనాలను సృష్టిస్తుంది.గుడ్ న్యూస్ ఏంటి అంటే  ట్రంఫ్ మోటార్ సైకిల్స్ లిమిటెడ్ భారతదేశంలో కొత్త ట్రంఫ్  రాకెట్ 3 ను విడుదల చేయనుంది.

వాస్తవానికి వచ్చే నెలలో గోవాలో జరగనున్న  ఇండియా బైక్ వీక్‌ 2019 లో ట్రంఫ్ మోటార్‌సైకిల్స్  ఇండియాలో రాకెట్ 3 ని ప్రదర్శించనున్నట్లు ధృవీకరించింది. ట్రంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో సంస్థ ఆరేళ్ల వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ కొత్త రాకెట్ 3 బైక్ ప్రదర్శించనున్నారు.

Latest Videos

 ట్రంఫ్ బైక్ రాకెట్ 3 R మరియు GT అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. రాకెట్ 3 R స్పోర్టియర్ హ్యాండిల్ బార్ ఇంకా బైక్ మధ్య విభాగంలో ఉంచిన ఫుట్‌పెగ్‌లతో వస్తుంది. జిటి మోడల్ బైక్ టూరింగ్ కోసం మరింత కంఫర్ట్-ఓరియెంటెడ్ గా ఉంటుంది. దీనికి సీటు ఎత్తు కాస్త తక్కువగా ఉంటుంది.

అడ్జస్ట్ చేయగల బ్యాక్‌రెస్ట్, ఫుట్‌పెగ్‌లు, కొంచెం పొడవైన ఫ్లైస్క్రీన్ లను పొందుతుంది. GT లో రైడర్ సీటింగ్ పొజిషన్ కోసం కొంచెం పొడవైన హ్యాండిల్ బార్, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లతో మరింత టూరింగ్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇవి మూడు  పొజిషన్స్ లో సెట్ చేసుకోవచ్చు.

2020  ట్రంఫ్ రాకెట్ 3 లో అతిపెద్ద మార్పు ఏంటి అంటే దీని కొత్త ఇంజన్. ఇది 2,458ccతో వస్తుంది. ఇది పాత మోడల్ రాకెట్ III కన్నా ఎక్కువ సామర్థ్యం, పనితీరు కలిగి ఉంటుంది. ట్రంఫ్ మోటార్‌సైకిల్స్  ప్రపంచంలోనే అతిపెద్ద  మోటార్ సైకిల్ ఇంజన్లను ఉత్పత్తి చేసే సంస్థ .
.
 ట్రంఫ్ రాకెట్ 3 బైక్ లో 3-సిలిండర్, DOHC ఇంజిన్, 6,000rpm వద్ద 165bhp గరిష్ట శక్తిని, 4,000rpm వద్ద 221nm గరిష్ట టార్క్  అందిస్తుంది. తేలికన క్రాంక్కేస్ అసెంబ్లీ వల్ల 11 కిలోల వరకు బైక్ వెయిట్ ఆదా చేస్తుంది. 3.9 కిలోల వెయిట్ ఆదా చేసే ఇంటిగ్రల్ ఆయిల్ ట్యాంక్‌, 3.6 కిలోల వెయిట్ ఆదా చేసే కొత్త బ్యాలెన్సర్ షాఫ్ట్‌ల కారణంగా ఇంజిన్ 18 కిలోల తేలికగా ఉంటుంది.

రాకెట్ 3 బైక్ కేవలం 2.79 సెకన్లలో 0-60 mph (0-96 kmph) వేగాన్ని అందుకోగలదు అని తెలిపారు. ట్రంఫ్ రాకెట్ 3 కొత్త మోడల్ బైక్ భారతదేశంలో వచ్చే సంవత్సరం మధ్యలో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. దీని ధర 16 నుంచి 18 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కొత్త తరం  ట్రంఫ్ రాకెట్ 3 డుకాటీ డయావెల్ 1260, డుకాటీ ఎక్స్‌ డియావెల్ బైకులకు పోటీగా ఉంటుంది.

click me!