కార్లంటే ఇష్టపడే వారి కోసం మెర్సిడెజ్ నుంచి లగ్జరీ మోడల్ కారు...

By Sandra Ashok Kumar  |  First Published Nov 25, 2019, 12:37 PM IST

ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంచ్ విపణిలోకి సరికొత్త ఎస్ యూవీ మోడల్ ‘మే బ్యాచ్ జీఎల్ఎస్ 600’ను వచ్చే ఏడాది మధ్యలో ఆవిష్కరించనున్నది. ఇది రోల్సో రాయిస్ వారి కులినన్, బెంట్లీకి చెందిన బెంటాయ్గా, మాసెరటి లెవంటే మోడల్ కార్లతో తలపడనున్నది.


సుదీర్ఘ కాలంగా కార్ల ప్రేమికులు ఎదురుచూస్తున్న మెర్సిడెజ్ -మే బ్యాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ లగ్జరీ కారు ఎట్టకేలకు మార్కెట్లో ఆవిష్క్రుతమైంది. వచ్చే ఏడాది మధ్యలో గ్లోబల్ మార్కెట్లో అడుగు పెట్టేందుకు మెర్సిడెజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 4మ్యాటిక్ రంగం సిద్ధమైంది. 

ఈ నూతన ఎస్ యూవీ మోడల్ కారు ప్రత్యర్థి సంస్థలు రోల్సో రాయిస్ వారి కులినన్, బెంట్లీకి చెందిన బెంటాయ్గా, మాసెరటి లెవంటేలతో పోటీ పడనున్నది. 4 లేదా ఐదు సీట్ల ఆప్షన్లలో ఈ ఎస్‌యూవీ కారు లభ్యం కానున్నది. 4.0 లీటర్ల వీ8 ఇంజిన్ సామర్థ్యం గల ఈ కారు 542 బీహెచ్పీతోపాటు 730 ఎన్ఎం టార్చి శక్తినిస్తుంది. 9జీ-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌గా రూపాంతరం చెందుతుంది. 

Latest Videos

48 వోల్టుల సిస్టమ్ ఈక్యూ బూస్ట్ తోపాటు అదనంగా 250 ఎన్ఎం టార్చి, 21 బీహెచ్పీ శక్తిని తాత్కాలికంగా వెలువరిస్తుంది. ముందు సీట్లలో కూర్చునే వారికి హీట్ పెంచుకునే వెసులుబాటుతోపాటు వెంటిలేటెడ్, మసాజింగ్ సీట్లు ఏర్పాటు చేశారు. మాసివ్‌గా, స్పోర్ట్స్ ఎలాట్ ఆఫ్ బ్లింగ్‌గా ఈ కారు క్రోమ్ గ్రిల్లె, స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బంపర్ కలిగి ఉంటుంది. స్కిడ్ ప్లేట్ మీద థిక్ క్రోమ్ ఫ్రేమ్ తోపాటు క్రోమ్ గ్రిల్లె అటాచ్ చేయబడి ఉంటుంది.  

click me!