దీపావళికి రోడ్లపైకి టాటా ‘టియాగో జేటీపీ’!!

By sivanagaprasad kodati  |  First Published Sep 21, 2018, 7:59 AM IST

టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడంలో బిజీబిజీగా ఉంది. పనితీరే ప్రధానంగా టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’ మోడల్ కారును వచ్చే నెలలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది.


టాటా మోటార్స్ ఫలితాల సాధనకు, ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వదు. విలువలే ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థ టాటా మోటార్స్. ‘టాటా టియాగో, ‘టాటా టైగోర్ జేటీపీ’ మోడల్ కార్ల కోసం ప్రయాణికులు ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో టియాగో, టైగోర్ జేటీపీ మోడల్ కార్లను ప్రదర్శించింది. వచ్చేనెలలో పండుగల సీజన్ ప్రారంభం కాగానే కార్ల తయారీ సంస్థలు నూతన మోడల్ కార్లను మార్కెట్‌లోకి తేనున్నాయి. 

అదే క్రమంలో టాటా మోటార్స్ తన ఉత్పత్తులను మార్కెట్‌లోకి  తేవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ గుంటేర్ బుచెక్ కూడా త్వరలో ‘టాటా టియాగో జేటీపీ’ మోడల్ కారును మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ధ్రువీకరించారు. ఇటీవల టియాగో ఎన్నార్జీ మోడల్ కారు ఆవిష్కరణ సంగతి సందర్భంగా ఈ సంగతి చెప్పారు.

Latest Videos

తాజాగా వెల్లడైన సమాచారం మేరకు టాటా మోటార్స్ యాజమాన్యం వ్యాపార, వాణిజ్యవేత్తలకు ప్రీతిపాత్రమైన దీపావళి నాడు టాటా టియాగో జేటీపీ మోడల్ తోపాటు మరో మూడు మోడల్ నూతన కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నది. టాటా టియాగో జేటీపీ బ్రాండ్ కారు అత్యుత్తమైన మోడల్ గా నిలుస్తుందని మార్కెట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జయేం ఆటోమోటివ్స్ సహకారంతో టాటా మోటార్స్ ‘టాటా టియాగో జేటీపీ’ మోడల్ కారును అభివ్రుద్ధి చేసింది. దీంతోపాటు మరో మూడు మోడల్ కార్లను వచ్చే పండుగల సీజన్‌లో మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీక్ మాట్లాడుతూ ‘ప్రస్తుత పండుగల సీజన్‌లో వినియోగదారులకు నాలుగు మోడల్ కార్లను అందుబాటులోకి తేనున్నది. అందులో టియాగో జేటీపీ ఒకటి. దీంతోపాటు ఇతర సంస్థలకు చెందిన హెచ్5ఎక్స్, హెచ్7ఎక్స్ ఎస్‌యూవీ, ప్రీమియం హ్యాచ్ బ్యాక్ 45ఎక్స్ మోడల్ కార్లు పండుగల సీజన్‌లో మార్కెట్ లోకి ప్రవేశించనున్నాయి. 

ఇటీవలే టాటా నెక్సాన్ కరాజ్, టాటా టియాగో ఎన్నార్టీ మోడల్ కార్లను విడుదల చేసింది. సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కార్ల విక్రయాల్లో నెక్సాన్ క్రాజ్ అదరగొట్టేసింది. టియాగో ఎన్నార్జీ మోడల్ కారులో హ్యాచ్ బ్యాక్, ఇతర ఫీచర్లు ఉన్నాయి. 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, సైడ్ స్కర్ట్స్ ఫినిష్డ్ ఓఆర్వీఎంఎస్‌తో టియాగో జేటీపీ కారుతో రోడ్లపై షికారు చేయొచ్చు. ఇందులో డిఫ్యూజర్, బ్లాక్ రూప్ స్పాయిలర్, డ్యుయల్ ఎక్సాస్ట్ టిప్స్ తదితరాలు అదనపు ఆకర్షణ కానున్నాయి. 

8 - స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో 1.2 లీటర్ల 3- సిలిండర్ రివోట్రోన్ పెట్రోల్ మోటార్, 5 - స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్నాయి. టియాగో ఎన్నార్జీ మోడల్ కారుతోపాటు టియాగో జేటీపీ ఎడిషన్ కారు ధర మార్కెట్లో రూ.6 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. 

click me!