మారుతి ‘సియాజ్’కు సరిజోడి హ్యుండాయ్ ‘వెర్నా’

By Arun Kumar P  |  First Published Sep 15, 2018, 10:52 AM IST

ఏడాది క్రితం ‘వెర్నా’ మోడల్ కారును భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసిన హ్యుండాయ్ కంపనీ.. రికార్డు స్థాయిలో 79,608 కార్లను విక్రయించింది. ఈ మోడల్‌కు వినియోగదారుల నుండి లభించిన ఆదరణ ఈ  కంపనీకి రెట్టించిన ఉత్సాహాన్నించ్చింది. ఈ ఉత్సాహంతో వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త పీచర్లతో లిమిటెడ్ ఎడిషన్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
 


న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) నుంచి వెర్నా మోడల్‌ కొత్త వార్షికోత్సవ ఎడిషన్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. దీని ధర రూ.11.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షలు పలుకుతోంది. పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.12.83 లక్షలకు ఉంటుంది. 1.6 లీటర్ల సామర్థ్యంతోపాటు మాన్యువల్ గేర్ బాక్స్ గల డీజిల్ ఇంజిన్ ఉన్న కారు ధర రూ.13.03 లక్షలు పలుకుతోంది. కేవలం 1000 కార్లను మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికతో వార్షికోత్సవ ఎడిషన్‌గా తీసుకొచ్చినట్లు హెచ్‌ఎంఐఎల్‌ తెలిపింది. 

ఏడాది క్రితం భారత దేశ మార్కెట్‌లోకి వెర్నా మోడల్ కారును ఆవిష్కరించిన హ్యుండాయ్ సిటీ మోడల్ కారు ఏడాది కాలంలోనే 79,608 కార్లను విక్రయించింది. ఇదే ఉత్సాహంతో నూతన తరం ‘వెర్నా’ మోడల్ కారును ఆవిష్కరించింది. పెట్రోల్ వేరియంట్ కారు నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది హ్యుండాయ్. 

Latest Videos

ఈ కారుకు వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, ముందు, వెనకా స్కిడ్‌ ప్లేట్లు తదితర సదుపాయాలు గల ప్రత్యేకతలు. ఈ సందర్భంగా హ్యుండాయ్ ఎండీ అండ్ సీఈఓ వైకే కూ మాట్లాడుతూ ‘గత ఏడాది ఆగస్టులో వెర్నా మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చాం. నెక్ట్స్‌-జెన్‌ వెర్నాకు మంచి స్పందన లభించింది. మా వినియోగదారులను సంతోషపరచడమే మా లక్ష్యం. వార్షికోత్సవ ఎడిషన్‌తో వారికి కావల్సిన మరిన్ని వసతులతో వెర్నా కార్లను రూపొందించాం’ అని చెప్పారు. 

రూ. 8.77 లక్షల నుంచి రూ.13.92 లక్షలు పలికే హోండా సిటీతోపాటు ఇటీవలే మారుతి సుజుకి అప్ డేట్ చేసిన రూ.8.19 నుంచి రూ.10.97 లక్షలు పలికే ‘సియాజ్’ మోడల్ కారును హ్యుండాయ్ వెర్నా కారు పోలి ఉంటుంది. 2 ఎక్స్‌టీరియర్ పెయింట్ షేడ్స్.. మెరీనా బ్లూ అండ్ పోలార్ వైట్ ఏర్పాటయ్యాయి. రేర్ స్పాయిల్, బ్లాక్ వింగ్ మిర్రర్ క్యాప్, షార్క్ ఫిన్ ఎంటీనా తదితర వసతులను కారు వినియోగదారుల కోసం హ్యుండాయ్ అందుబాటులోకి తెచ్చింది. 

click me!