కంపాక్ట్ టాటా‘ట్రక్కు’ ఆవిష్కరణ.. ఎస్సీవీ సెగ్మెంట్‌లో గ్యాప్ ఇలా పూడ్చేస్తుంది

Published : May 23, 2019, 03:11 PM IST
కంపాక్ట్ టాటా‘ట్రక్కు’ ఆవిష్కరణ.. ఎస్సీవీ సెగ్మెంట్‌లో గ్యాప్ ఇలా పూడ్చేస్తుంది

సారాంశం

దేశీయ ఆటోమొబైల్ మేజర్ టాటా మోటార్స్ నూతన తరం కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా.. స్మాల్ కమర్షియల్ వెహికల్స్ సెగ్మెంట్‌లో గ్యాప్‌ను భర్తీ చేసే దిశగా విపణిలోకి ‘ఇంట్రా’ టక్కును ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.5.35 లక్షలుగా ఉన్నది. వీ10, వీ 20 వేరియంట్లలో ఇంట్రా వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ మేజర్ టాటా మోటార్స్ విపణిలోకి కంపాక్ట్ ట్రక్కు ‘ఇంట్రా’ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 5.35 లక్షలుగా నిర్ణయించారు. రెండు వేరియంట్లు ‘వీ10’, ‘వీ20’ల్లో లభించే ఇంట్రా మోడల్ ట్రక్కు.. ఏస్ రేంజ్ కంటే మెరుగ్గానే ఉంటుంది.

ఇంట్రా ‘వీ 10’మోడల్ వేరియంట్ 800 సీసీ డీజిల్ ఇంజిన్, వీ20 ట్రిమ్ వేరియంట్ 1400 సీసీ పవర్ ట్రైన్ సామర్థ్యం గల ఇంజిన్‌తో వినియోగదారుల ముంగిట్లోకి వస్తోంది. రెండు ఇంజిన్లు కూడా బీఎస్ -4 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దడంతోపాటు బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు వీలుగా డిజైన్ చేశారు. 

టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ ‘వాహనాల మెరుగైన పనితీరు, అడ్వాన్సుడ్ ఫీచర్లు, హై రిటర్న్స్ దిశగా కస్టమర్ల ప్రాధాన్యాలు ప్రతిరోజూ మారిపోతున్నాయి. నూతన తరం వినియోగదారుల్లో పెరిగిపోతున్న ఆకాంక్షలపై అధ్యయనం ద్వారా తెలుసుకున్నాం’ అని తెలిపారు. 

ఈ అధ్యయనం ద్వారా వచ్చిన సూచనలు, సలహాల ద్వారా నూతన తరం కస్టమర్లకు అవసరాలకు అనుగుణంగా ట్రక్కులను అభివ్రుద్ది చేయగలిగాం అని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ తెలిపారు. 

కస్టమర్ల కోరిక, ఆకాంక్షల మేరకు కమర్షియల్ వెహికల్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలన్న విధానానికి ఇదొక ఐడియల్‌గా ఉంటుందని, దీనివల్ల హయ్యర్ బిజినెస్ రిటర్న్స్ ఉంటాయని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ చెప్పారు. అలాగే ఓనర్ షిప్ టోటల్ కాస్ట్ తక్కువగానూ, హాయిగా ముందుకు సాగేందుకు వీలుగానూ ఉంటుందన్నారు. 

దేశీయ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లో నెలకొన్న అంతరాయాన్ని తమ కంపాక్ట్ ‘ఇంట్రా’ పూడుస్తుందని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గిరీష్ వాఘ్ చెప్పారు. ఎస్సీవీ, అండ్ పికప్ వెహికల్స్ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ 40.1 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. ఇప్పటి వరకు ‘టాటా ఏస్’ ట్రక్కు 20 లక్షలకు పైగా విక్రయించింది. 

PREV
click me!

Recommended Stories

Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్
MG hector facelift: మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ల‌గ్జ‌రీ కారు.. అందుబాటు ధ‌ర‌లో MG హెక్ట‌ర్ కొత్త కారు