టాటా మోటార్స్ వాహనాల ధరల పెంపు.. జనవరి నుండి వర్తింపు.. దేనిపై ఎంతంటే ?

By asianet news telugu  |  First Published Dec 14, 2022, 5:16 PM IST

కంపెనీ ప్రకారం, వివిధ మోడల్స్ అండ్ వేరియంట్‌లను బట్టి ధరల పెంపు మారుతూ ఉంటుంది. ధరల పెంపు మొత్తం వాణిజ్య వాహనాలకి వర్తిస్తుంది. టాటా మోటార్స్ ఒక ప్రకటనలో, పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగాన్ని కంపెనీయే భరిస్తోందని తెలిపింది.


దేశంలోని అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వాహనాల తయారీ వ్యయం ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ వచ్చే ఏడాది జనవరి నుంచి  వాణిజ్య వాహనాల ధరలను రెండు శాతం వరకు పెంచనుంది. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. 

కంపెనీ ప్రకారం, వివిధ మోడల్స్ అండ్ వేరియంట్‌లను బట్టి ధరల పెంపు మారుతూ ఉంటుంది. ధరల పెంపు మొత్తం వాణిజ్య వాహనాలకి వర్తిస్తుంది. టాటా మోటార్స్ ఒక ప్రకటనలో, పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగాన్ని కంపెనీయే భరిస్తోందని తెలిపింది. కానీ మొత్తం వ్యయం వేగంగా పెరగడంతో కంపెనీ వాహనాల ధరలను కనిష్టంగా పెంచాల్సి వచ్చింది. 

Latest Videos

undefined

తొలిసారిగా ధరలు పెంపు 
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగంలో దేశంలోనే అగ్రగామి సంస్థ. 2023 క్యాలెండర్ సంవత్సరంలో వాణిజ్య వాహనాల ధరలను పెంచడానికి టాటా మోటార్స్ తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే. అంతకుముందు, కంపెనీ 2022 సంవత్సరం జనవరి, ఏప్రిల్, జూలై అండ్ అక్టోబర్ నెలల్లో వాణిజ్య వాహనాల ధరలను భారీగా పెంచింది. 

ప్యాసింజర్ వాహనాల ధరలు
ఏప్రిల్, 2023లో అమల్లోకి రానున్న కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వచ్చే నెల నుండి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 

టాటా కమర్షియల్ వెహికల్ పోర్ట్‌ఫోలియో
టాటా మోటార్స్ కి కమర్షియల్ వెహికల్ పోర్ట్‌ఫోలియో ఉంది. వీటిలో టాటా ఏస్, టాటా సిగ్నా, టాటా అల్ట్రా, టాటా ఎల్‌పికె, టాటా ఎస్‌ఎఫ్‌సి, టాటా ఎల్‌పిటి ఉన్నాయి. టాటా వాణిజ్య వాహనాల ధరలు రూ. 3.99 లక్షల నుండి  మొదలై రూ. 78.03 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ వాణిజ్య వాహనాల లైనప్‌లో అత్యంత ఖరీదైన కారు టాటా సిగ్నా 2823. భారతదేశంలో టాటా కె డ్రిల్ రిగ్ పికప్ ట్రక్ ధర రూ.78.03 లక్షలు. కంపెనీకి చెందిన ఈ వ్యాగన్‌లో మినీ ట్రక్కులు, ట్రక్కులు, టిప్పర్లు, ట్రైలర్‌లు, ట్రాన్సిట్ మిక్సర్‌లు కూడా ఉన్నాయి.

click me!