జనవరిలో టాటా ‘ఆల్ట్రోజ్’ ఆవిష్కరణ...ఆల్ఫా ఆర్కిటెక్చర్‌తో రూపకల్పన

By Sandra Ashok KumarFirst Published Nov 23, 2019, 5:53 PM IST
Highlights

టాటా ఆల్టోజ్ కారు ప్రత్యర్థి సంస్థలైన మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఎలైట్ ఐ20, టయోటా గ్లాన్జా, హోండా జాజ్, వోక్స్ వ్యాగన్ పోలో మోడల్ కార్లతో తలపడనున్నది. 

న్యూఢిల్లీ: ఎట్టకేలకు టాటా మోటార్స్ వారి ఆల్ట్రోజ్ కారు ఆవిష్కరణ తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని విపణిలో ఆవిష్కరించేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. ఇంతకుముందు 2019 మధ్యలోనే ఆవిష్కరించాలని ముందుగా నిర్ణయించింది.

ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ఆల్ఫా) ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దుకున్నది టాటా ఆల్ట్రోజ్. ప్రీమియం సెడాన్ కారు అయిన ఆల్ట్రోజ్.. ప్రత్యర్థి సంస్థలు మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఎలైట్ ఐ20, టయోటా గ్లాన్జా, హోండా జాజ్, వోక్స్ వ్యాగన్ పోలో మోడల్ కార్లతో పోటీ పడనున్నది. 

టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ కారు ధర రూ.5.50 లక్షల నుంచి మొదలై రూ.8.50 లక్షల వరకు సాగుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవాలో జరిగిన 89వ ఇంటర్నేషనల్ మోటారు షోలో తొలుత టాటా మోటార్స్ అధికారికంగా ప్రదర్శించింది. 

అంతేకాదు టాటా మోటార్స్ ‘ఇంపాక్ట్ 2.0’ డిజైన్‌తో రూపుదిద్దుకున్న రెండో వాహనం టాటా ఆల్ట్రోజ్. ఈ కారు డ్యుయల్ టోన్ రూఫ్ కలిగి ఉంటుంది. స్పోర్టీ గ్రిల్లి, డ్యుయల్ స్లిమ్ హెడ్ ల్యాంప్స్, పియానో బ్లాక్ ఓఆర్వీఎంస్ కలిగి ఉంటుంది. సీ పిల్లర్ మీద రేర్ డోర్ హ్యాండిల్ అమర్చారు. 

న్యూ ఆల్ట్రోజ్ డ్యూయల్ టోన్ ఇంటిరియర్స్ కలిగి ఉంటుంది. స్పేసియస్ క్యాబిన్‌తోపాటు 3 స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7- అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, టీఎఫ్టీ క్లస్టర్ డిస్ ప్లే విత్ న్యూ ఇంటర్ ఫేస్ ఫీచర్ కూడా జత కలిపారు. ఆంబియెంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ తదితర ఫీచర్లు చేర్చారు. 

1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తోపాటు 102 బీహెచ్పీతో 140 ఎన్ఎం టార్చిని విడుదల చేస్తుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికైతే ఇతర పవర్ ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయా? లేదా? అన్న సంగతి తెలియరాలేదు. 

click me!