Maruti WagonR: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే కేవలం రూ. 1.60 లక్షలకే మారుతి వేగన్ ఆర్ కారు మీ సొంతం

By Krishna Adithya  |  First Published Jul 10, 2022, 1:13 PM IST

కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల నడుమ ప్రతీఒక్కరూ సొంత వాహనాల ద్వారా వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కార్లలో వెళ్లేందుకు జనం ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు కారు అంటే లగ్జరీ, కానీ ఇప్పుడు అవసరంగా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కన్నా కూడా, కార్ల ద్వారా వెళ్లడం ద్వారా కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. 


కార్లలో ప్రధానంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) దాని అద్భుతమైన ఫీచర్లు, అధిక మైలేజీ కారణంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  కంపెనీ ఈ కారును భారత మార్కెట్లో ₹ 5.47 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి తెచ్చింది. దీని టాప్ వేరియంట్ ధరను కంపెనీ రూ.7.20గా నిర్ణయించింది. అయితే మీ వద్ద అంత బడ్జెట్ లేకపోతే యూజ్డ్ కార్స్ కూడా చక్కటి ఎంపికగా వస్తున్నాయి.  

మారుతి కంపెనీకి చెందిన Maruti Suzuki WagonR కారు యూజ్డ్ వెహికల్ కొనుగోలు చేయాలనుకుంటే, ఆన్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. పలు ఆన్ లైన్ వెబ్‌సైట్లలో సెకండ్ హ్యాండ్ కార్లను సర్టిఫైడ్ చేసి మరీ అమ్మకానికి పెడుతున్నారు. మీరు ఆ కార్లను సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.  మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేకపోతే, మీరు పలు వెబ్ సైట్స్ లోని మీ బడ్జెట్‌లో కారును కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

CARDEKHO వెబ్‌సైట్‌లో డీల్‌ ఇలా ఉంది..
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 2010 మోడల్‌ మంచి డీల్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ధరను కంపెనీ రూ. 1.55 లక్షలుగా నిర్ణయించింది.

CARWALE వెబ్‌సైట్‌లో డీల్ ఇలా ఉంది:
మీరు CARWALE వెబ్‌సైట్‌లో బెస్ట్ డీల్‌ ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) 2012 మోడల్‌ కారును మీరు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ధరను కంపెనీ రూ. 1.6 లక్షలుగా నిర్ణయించింది.

CARTRADE వెబ్‌సైట్‌లో డీల్‌:
CARTRADE వెబ్‌సైట్‌లో అందించిన ఉత్తమమైన డీల్‌ ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) 2013 మోడల్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ధరను కంపెనీ రూ. 1,60,000గా నిర్ణయించింది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) ఫీచర్లు:
కంపెనీ మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ (Maruti Suzuki WagonR)లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ యొక్క శక్తి 637 PS గరిష్ట శక్తిని, 89 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ కంపెనీచే 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ తో వస్తుంది.  మైలేజీ గురించి మాట్లాడుకుంటే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR) పెట్రోల్‌పై 24.35 kmpl మైలేజీని ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. అదే సమయంలో, సిఎన్‌జిపై కిలోకు 34.05 కిమీ మైలేజీ అందుబాటులోకి వచ్చింది.

click me!